Pakistan: పాక్ సంచలన నిర్ణయం.. ఈ 12 దేశాల నుంచి రాకపోకలపై నిషేధం.. పాతరోజులు మళ్లీ వచ్చేస్తున్నాయా..?

ప్రతీకాత్మక చిత్రం

మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు లాక్ డౌన్ బాట పట్టక తప్పదా? సరిగ్గా ఏడాది క్రితంలాగా ఒక్కో దేశం మళ్లీ గిరిగీసి సరిహద్దులు మూసుకోక తప్పదా? తాజాగా పాక్ ప్రభుత్వం చేసిన పనితో..

  • Share this:
    కరోనా వ్యాక్సిన్ వచ్చేసిందన్న ధైర్యమో, కరోనా మమ్మల్ని ఏమీ చేయలేదన్న అతినమ్మకమో ఏమో కానీ ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. మాస్కులు ధరించడం లేదు. సామాజిక దూరం అసలే పాటించడం లేదు. ఈ క్రమంలోనే కరోనా స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. కొత్త రకం కరోనా వైరస్ ధాటి నుంచి బయటపడేందుకు మరోసారి దేశాలన్నీ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. గతంలో ఎదురైన అనుభవాల రీత్యా అన్ని దేశాలు ఇప్పటికే అప్రమత్తం అవుతున్నాయి. ప్రపంచ దేశాల నుంచి పౌరుల రాకపోకలపై ఒక్కో దేశం కొన్ని ఆంక్షలను విధిస్తూ వస్తోంది. తాజాగా పాకిస్తాన్ కూడా కరోనా స్ట్రెయిన్ ను ఎదుర్కొనేందుకు అప్రమత్తం అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 దేశాల నుంచి ప్రయాణికుల రాకను నిషేధిస్తూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

    ప్రపంచంలోని అన్ని దేశాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తూ పాక్ ప్రభుత్వం ఓ సరికొత్త ప్రణాళికను రచించుకుంటోంది. ఏ కేటగిరీలో ఉన్న దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారికి కనీసం కరోనా పరీక్ష కూడా నిర్వహించరు. బీ కేటగిరీలో ఉన్న దేశాల నుంచి వచ్చే పౌరులకు కరోనా టెస్టులు తప్పనిసరిగా నిర్వహిస్తారు. అవసరమయితే కొద్దిరోజులు క్వారంటైన్ లో ఉండాలని చెబుతారు. ఇక సీ కేటగిరీలో ఉన్న దేశాల నుంచి అయితే ఏ ఒక్క పౌరుడిని తమ దేశంలోకి రానివ్వబోమని పాక్ సర్కారు స్పష్టం చేసింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఓ స్పష్టమైన ప్రకటనను విడుదల చేసింది.
    ఇది కూడా చదవండి: శోభన్ బాబు చనిపోయిన రోజు అసలేం జరిగింది..? తండ్రితో మాట్లాడి కొడుకు బయటకు వెళ్లగానే..

    పాకిస్తాన్ లో ఆదివారం ఒక్క రోజే ఏకంగా 3667 కొత్త కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 12 దేశాలను సీ కేటగిరీలో లిస్ట్ లోకి చేర్చి, ఆ దేశాల నుంచి రాకపోకలను నిషేధిస్తూ పాక్ ఆదివారం ఓ ప్రటననను జారీ చేసింది. బోత్సానా, బ్రెజిల్, కొలంబియా, కామోరస్, ఘనా, కెన్యా, మోజాంబికో, పెరూ, ర్వాండా, దక్షిణాఫ్రికా, టాంజానియా, జాంబాయా దేశాలను సీ కెటగిరీలోకి చేర్చారు. ఈ పన్నెండు దేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలను నిషేధించారు. మార్చి 23 నుంచి ఏప్రిల్ 5వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని అధికారులు తేల్చిచెప్పారు.
    ఇది కూడా చదవండి: ‘ఆ శోభన్ బాబు చచ్చిపోయాడురా.. అనేవాడు.. ప్రతి నెలా నాకు రూ.10 లక్షలు.. అంతా ఆయన చలవే..’.. దర్శకుడు కోదండరామిరెడ్డి కామెంట్స్
    Published by:Hasaan Kandula
    First published: