కాంగ్రెస్ నేత సిద్ధూకు పాకిస్థాన్ ప్రధాని సర్‌ప్రైజ్ గిఫ్ట్...

కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మొదటి ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్ధు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ఆహ్వానాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్.. నవ్‌జోత్ సింగ్ సిద్ధుకు స్వయంగా పంపడం విశేషం.

news18-telugu
Updated: November 4, 2019, 9:21 PM IST
కాంగ్రెస్ నేత సిద్ధూకు పాకిస్థాన్ ప్రధాని సర్‌ప్రైజ్ గిఫ్ట్...
నవజ్యోత్ సింగ్ సిద్ధూ
  • Share this:
పాకిస్థాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మొదటి ఆహ్వానాన్ని కాంగ్రెస్ నేత నవ్‌జోత్ సింగ్ సిద్ధు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ఆహ్వానాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్.. నవ్‌జోత్ సింగ్ సిద్ధుకు స్వయంగా పంపడం విశేషం. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లడంపై సిద్ధు వివాదాలకు కేంద్రబిందువయ్యాడు. అయితే ఈ కార్యక్రమాన్ని భారత్ పాకిస్థాన్‌లు విడివిడిగా నిర్వహించనున్నాయి. ఇదిలా ఉండగా భారత్ నిఘా సంస్థలు పాకిస్థాన్‌లోని నరోవాల్ జిల్లాలో ఉగ్రకదలికలను పసిగట్టాయి. ఈ జిల్లాలోనే టెర్రరిస్టులకు శిక్షనిచ్చేందుకు ఉద్దేశించిన ఉగ్రశిబిరాలు ఆ జిల్లాలో కనుగొన్నట్టు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను పాకిస్తాన్ ఉగ్రకార్యకలాపాలు ప్రోత్సహించేందుకు వినియోగించే అవకాశం ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఖలిస్తాన్ వేర్పాటువాదులను పాకిస్థాన్ ప్రోత్సాహం అందిస్తోందని, ఓ నివేదిక విడుదలైన నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా ఈ కార్యక్రమం నవంబర్ 9న జరగనుంది.
First published: November 4, 2019, 9:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading