పాకిస్థాన్ పైత్యం.. కశ్మీర్ వేర్పాటువాదికి అత్యున్నత పౌర పురస్కారం

కశ్మీర్ వేర్పాటువాది, కశ్మీర్‌లో యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించిన సయ్యద్ గిలానీని పాక్ ప్రభుత్వం గౌరవించుకుంది.

news18-telugu
Updated: July 28, 2020, 1:56 PM IST
పాకిస్థాన్ పైత్యం.. కశ్మీర్ వేర్పాటువాదికి అత్యున్నత పౌర పురస్కారం
వేర్పాటువాది సయ్యద్ గిలానీ (ఫైల్ ఫోటో)
  • Share this:
భారత్‌ను విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రొత్సహించడంలో ముందుండే పాకిస్థాన్... ఈ విషయంలో తన వక్రబుద్ధిని ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంది. తాజాగా కశ్మీర్ వేర్పాటువాది, కశ్మీర్‌లో యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించిన సయ్యద్ గిలానీని పాక్ ప్రభుత్వం సముచితంగా గౌరవించుకుంది. పాక్ అత్యున్నత పౌర పురస్కారమైన నిషాన్ -ఈ- పాకిస్తాన్ అవార్డును గిలానీకి ప్రకటించింది పాకిస్థాన్. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించి, ఓ సంవత్సరం పూర్తికావడానికి వారం ముందే పాకిస్థాన్ ప్రభుత్వం గిలానీకి ఈ అవార్డు ప్రకటించడం గమనార్హం.

ఇక కొద్ది రోజుల కిందటే హురియత్‌ కాన్ఫరెన్స్ చైర్మన్ పదవికి గిలానీ రాజీనామా చేశారు. సంస్థలో జవాబుదారీతనం లోపించిందని ఆరోపించిన గిలానీ.. సభ్యుల్లో తిరుగుబాటు తనం పెరిగిపోయిందని అన్నారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మొత్తానికి కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రొత్సహించిన గిలానీకి అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన పాకిస్థాన్.. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రొత్సహించే వారికి తమ మద్దతు ఉంటుందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.
Published by: Kishore Akkaladevi
First published: July 28, 2020, 1:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading