హోమ్ /వార్తలు /international /

Exclusive | పాకిస్తాన్, అమెరికా వల్లే ఈ దుస్థితి.. CNN-News18తో అప్గాన్ తాత్కాలిక అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్

Exclusive | పాకిస్తాన్, అమెరికా వల్లే ఈ దుస్థితి.. CNN-News18తో అప్గాన్ తాత్కాలిక అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్

Afghanistan Crisis: తాలిబన్ల (Taliban) దురాక్రమణతో అప్గనిస్తాన్‌(Aghanistan)లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రాణ భయంతో అప్గాన్ ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్గానిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ (Amrullah Saleh) సీఎన్ఎన్-న్యూస్ 18 వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Afghanistan Crisis: తాలిబన్ల (Taliban) దురాక్రమణతో అప్గనిస్తాన్‌(Aghanistan)లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రాణ భయంతో అప్గాన్ ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్గానిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ (Amrullah Saleh) సీఎన్ఎన్-న్యూస్ 18 వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.

Afghanistan Crisis: తాలిబన్ల (Taliban) దురాక్రమణతో అప్గనిస్తాన్‌(Aghanistan)లో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రాణ భయంతో అప్గాన్ ప్రజలు దేశం విడిచి పారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అప్గానిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ (Amrullah Saleh) సీఎన్ఎన్-న్యూస్ 18 వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఇంకా చదవండి ...

     అఫ్గానిస్థాన్‌ (Afghanistan)రాజధాని కాబూల్‌ను తాలిబన్లు (Taliban) వశం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నప్పుడే, అప్పటి దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) దేశం విడిచి పారిపోయారు. ఆ తరువాత తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తాను ప్రకటించుకున్నారు మరో నేత అమ్రుల్లా సలేహ్ (Amrullah Saleh).  తాలిబన్లను ఎదుర్కోవడానికి చేయగలిగినదంతా చేస్తానని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పంజ్‌షీర్ లోయలో తలదాచుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాలిబన్లకు తలవంచేది లేదని పలుమార్లు స్పష్టం చేశారు. ముష్కర మూకల ప్రవేశంతో దేశంలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొన్న క్రమంలో సలేహ్‌తో సీఎన్ఎన్-న్యూస్ 18 వార్తాసంస్థ మాట్లాడింది. ఈ ఇంటర్వ్యూలో తాలిబన్లకు పాకిస్తాన్(Pakistan) సాయం, అమెరికా(USA) నిర్ణయాలు, పంజ్‌షీర్ లోయ(Panjshir Valley)పై తాలిబన్ల ప్రభావం.. వంటి వివరాలను వెల్లడించారు. ఆ వివరాలు..

    ప్రశ్న: అఫ్గాన్‌ ప్రభుత్వం అంత త్వరగా కుప్పకూలుతుందని మీరు ముందే ఊహించారా? అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ పలాయనం చిత్తగించిన తీరుపై మీ అభిప్రాయం ఏమిటి?

    జవాబు: జరిగిపోయిన పెను విషాదాన్ని గుర్తుకు తెచ్చుకొని.. దాని గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం అని నేను అనుకోను.

    ప్రశ్న: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నందుకు మీరు ఎవరిని నిందిస్తారు? ఎందుకు నిందిస్తారు? తాలిబన్లు కాబూల్ ను ఆక్రమించుకున్న తర్వాత.. అఫ్గాన్‌తో పాటు ప్రపంచం ఎదుర్కొనే పరిణామాలు ఏంటి? భవిష్యత్తులో అఫ్గాన్‌ ఉగ్రవాదానికి పుట్టినిల్లు అవుతుందని మీరు అనుకుంటున్నారా?

    జవాబు: తాలిబన్లు ఎన్నడూ ఒత్తిడికి గురి కాలేదు. వాళ్ళు పాకిస్తాన్‌ను తమ మద్దతు స్థావరంగా వాడుకున్నారు. అక్కడ వారికి ప్రత్యేక సురక్షిత ప్రదేశాలంటూ ఏమీ లేవు. పాకిస్తాన్ మొత్తం కూడా తాలిబన్ల సేవలోనే ఉంది. పాకిస్తాన్ సహకారాన్ని ప్రోత్సహించి దానిని కొనుగోలు చేయడానికి అమెరికా ప్రయత్నించింది. అమెరికా ఎంత ఎక్కువగా చెల్లిస్తే.. అంత ఎక్కువ ధైర్యంతో పాకిస్తానీయులు తాలిబన్‌లకు మరింత సేవా సహాయాలు అందించారు. అఫ్గానిస్తాన్‌లో పశ్చిమ మిత్రదేశాలకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని, తిరుగుబాటును సమర్థించే పాకిస్తాన్ సమస్యను పరిష్కరించాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు.

    చనిపోయినా వదలరు.. మృతదేహాలతో శృంగారం.. తాలిబన్ల క్రూరత్వాన్ని వివరించిన మహిళ

    రెండవ కారణం ఏమిటంటే... దోహా శాంతి చర్చలు తాలిబన్లను చట్టబద్ధం చేశాయి. తాలిబన్లు తమ వాగ్దానం నిలబెట్టుకోకుండా మొత్తం అంతర్జాతీయ సమాజాన్ని మోసం చేశారు. అంతర్జాతీయ సమాజ జోక్యం లేకుండా శాంతియుత ప్రక్రియ కోసం పాటుపడటమే దోహా చర్చల ముఖ్య ఉద్దేశం. కానీ వారు సైనికులను ఓడించడానికి పెట్టుబడులు పెట్టారు. ఇందుకు పాకిస్తాన్ పూర్తి మద్దతు ఇచ్చింది.

    మూడవ కారణం ఏమిటంటే.. గడిచిన రెండేళ్లలో మా అమెరికన్ మిత్రదేశాలు.. ఖైదీలను విడుదల చేయండి లేదా సైనిక సహాయాన్ని తగ్గిస్తామని మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేశాయి. ఈ ఖైదీలు దేశం కోసం ముందు వరుసలో ఉండరని మీరు చెప్పగలరా అని మేము ప్రశ్నించినప్పుడు వారి దగ్గర సమాధానం లేదు. ఇప్పుడు వారందరూ ముందు వరుసలో నిలిచారు. దాంతో తాలిబన్‌లకు పోరాట యోధులను బహూకరించినట్లు అయ్యింది.

    నాల్గవ కారణం ఏమిటంటే.. ప్రభుత్వంలోని కొందరికి పరిస్థితుల గురించి తెలియని కారణంగా వారందరూ ప్రతి విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. ఇప్పుడు చెప్పిన నాలుగు కారణాలు మాత్రమే కాదు.. ప్రభుత్వం పడిపోవడానికి అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

    అఫ్గానిస్తాన్‌లో భారత్‌ ఆస్తుల విధ్వంసానికి ఐఎస్‌ఐ కుట్ర.. కొత్త ఉగ్రవాద సంస్థ ఏర్పాటు

    అంతిమంగా చెప్పదలచుకున్నది ఏమిటంటే.. నాటో, యూఎస్ మిలటరీ దళాలు వెళ్ళిపోయాయి. కానీ అఫ్గానిస్థాన్ ప్రజలు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. అల్-ఖైదా సానుభూతిపరులు, తాలిబాన్‌ల మధ్య లావాదేవీలను నియంత్రించే మనీలాండరర్ అఫ్గాన్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అయ్యాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సిగ్గుమాలిన ద్రోహలలో నేను భాగం కావాలనుకోవడం లేదు. అఫ్గానిస్థాన్ అనేది అఫ్గానిస్థాన్ లాగానే ఉంటుందని శత్రువులు తెలుసుకునేంత వరకు మేము పోరాడుతాం.

    ప్రశ్న: అమెరికన్ వైఖరి, ప్రవర్తనలపై మీ అభిప్రాయమేంటి? అనేక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని విడిచి వారు హఠాత్తుగా నిష్క్రమించారు. వాటిని పాకిస్తాన్ క్వెట్టాకు తీసుకెళ్లినట్లు తెలిసింది.

    జవాబు: యూఎస్ అనేది అత్యంత శక్తివంతమైనది. కానీ ఒక పొలిటికల్ జడ్జిమెంట్ యూఎస్ ను కూడా అవమానపరుస్తుంది. ఇది అమెరికన్ మిలిటరీ, అమెరికన్ ఇంటెలిజెన్స్ నిందించడానికి ఏమీ లేదు కానీ ఒక తప్పుడు నిర్ణయం వల్ల వారు మూల్యం చెల్లించడం ప్రారంభించారు.

    Afghanistan: తాలిబన్లకు షాక్.. పంజ్‌షిర్ లోయలో భారీ ఉద్యమం

    తాలిబన్లు ముప్పును అమెరికా ఊహించలేదనడంలో సందేహం లేదు. క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో మీ అధికారులు ఎందుకు అంచనా వేయలేకపోయారు?

    జవాబు: అమెరికా వైఖరిని మార్చేందుకు మనం చేయగలిగేది ఏమీ లేదు. నేను ఒక బాధ్యతగల హోదాలో ఉన్నానని అంగీకరిస్తున్నాను కానీ యూఎస్ నిర్ణయంలో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ పరిణామాల గురించి నేను 2 ఏళ్లుగా హెచ్చరిస్తున్నాను. ఇది కేవలం ఒక రాజకీయ నిర్ణయమే.

    ప్రశ్న: తాలిబన్‌లకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతున్న పంజ్‌షీర్ లోయలో భద్రతా పరిస్థితి ఏమిటి?

    జవాబు: పంజ్‌షీర్‌లో భద్రతా సిబ్బంది, దళాలు అన్నింటికీ సన్నద్దంగా ఉన్నాయి. పరిస్థితులన్నీ నియంత్రణలోనే ఉన్నాయి. ఈ ప్రాంతానికి అపారమైన ఖ్యాతి ఉంది. ఇక్కడి ప్రజలు గతంలోనూ తాలిబన్లను ధిక్కరించారు. దీని గొప్పతనాన్ని మళ్లీ ప్రపంచానికి చాటే పనిలో ఉన్నాం.

    First published:

    ఉత్తమ కథలు