PAKISTAN HAS INTRODUCED A SPECIAL SCHEME FOR RICH FOREIGNERS WHO BENEFITS EVK
Pakistan: ధనికులైన విదేశీయుల కోసం ప్రత్యేక స్కీమ్ ప్రవేశపెట్టిన పాకిస్థాన్.. ఎవరికి లబ్ధి!
ప్రతీకాత్మక చిత్రం
Pakistan | ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ (Pakistan) అందులోంచి బయటపడడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కొత్త ప్రథకానికి శ్రీకారం చుట్టారు. అయితే పాకిస్థాన్ చరిత్రలో రియల్ ఎస్టేట్ రంగంలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అనుమతించడం ఇదే మొదటి సారి.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న పాకిస్థాన్ (Pakistan) అందులోంచి బయటపడడానికి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) కొత్త ప్రథకానికి శ్రీకారం చుట్టారు. అమెరికా (America), కెనడా (Canada), ఆఫ్ఘన్, చైనా (Chia)లో నివసిస్తున్న సిక్కులతో సహా సంపన్న విదేశీ పౌరులకు పాకిస్తాన్లోశాశ్వత నివాస పథకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్కీమ్ జనవరి 15, 2022న ప్రారంభం అవుతుంది. వీదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు.. వీదేశీ మారకద్రవ్య నిలువలను పెంచుకోవడమే లక్ష్యంగా ఈ స్కీమ్‌ను ప్రవేశ పెట్టారు. ఈ స్కీమ్ గురించి పాకిస్థాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి రాత్రిపూట ట్వీట్ (tweet) చేసి ప్రకటించారు. అయితే పాకిస్థాన్ చరిత్రలో రియల్ ఎస్టేట్ రంగంలో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి అనుమతించడం ఇదే మొదటి సారి.
"కొత్త జాతీయ భద్రతా విధానానికి అనుగుణంగా, పాకిస్తాన్ తన జాతీయ భద్రతా సిద్ధాంతంలో జియో-ఎకనామిక్స్‌ను ప్రధానాంశంగా ఈ విధానం ప్రకటించింది. విదేశీ పౌరులకు శాశ్వత నివాస పథకాన్ని అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త విధానం వారు విదేశీయులుగా కాకుండా శాశ్వత నివాస హోదాను పొందేందుకు అనుమతిస్తుంది." అని ట్వీట్లో పాకిస్థాన్ మంత్రి పేర్కొన్నారు.
ఆఫ్ఘన్ ప్రభావం..
పాకిస్థాన్ ఈ కీలక ప్రకటన వెనుక ఉద్దేశాలను ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో ప్రధానమైంది. టర్కీ, మలేషియా (Malaysia) మరియు కొన్ని ఇతర దేశాలకు తరలి వెళ్తున్న ధనిక ఆఫ్ఘన్లను ఆకర్షించడం. ఆఫ్ఘన్లో తాలిబన్లు వచ్చాక చాలా మంది ధనికులు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించాలని పాక్ భావిస్తుంది.
కెనడా సిక్కులు లక్ష్యంగా..
ఈ పథకం ద్వారా ముఖ్యంగా కెనడా (Canada) లో సెటిల్ అయిన సిక్కులను ఆకర్షించ వచ్చని పాక్ భావిస్తోంది. కొందరు సిక్కులు మతపరమైన ప్రదేశాలలో, ముఖ్యంగా కర్తార్‌పూర్ కారిడార్‌లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని ఆకర్షించే లక్ష్యంగా పాక్ ఈ పథకం ప్రవేశ పెట్టిందనే వాదనలు ఉన్నాయి.
చైనా కోసం..
ఈ పథకం యొక్క మూడో లక్ష్యం పాకిస్తాన్లో పారిశ్రామిక యూనిట్లను చైనాకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన ఉంది. పాకిస్థాన్‌లో చైనా దేశీయులను ప్రోత్సహించడం వారి ప్రాముఖ్యతను పెంచడం. ముఖ్య ఉద్దేశంగా కనపడుతుంది. విదేశీ పౌరులు పాకిస్థాన్‌లో ఆస్తులు కొనుగోలు చేసేందుకు వీలు కల్పించే స్కీమ్‌పై బోర్డ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో కూర్చుని చర్చలు జరపాలని సంబంధిత శాఖలున ఆ దేశ క్యాబినెట్ (Cabinet) ఆదేశాల జారీ చేసింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.