Home /News /international /

PAKISTAN GOVERNMENT HIKES TAXES ON NEWS CARS UPTO 100 PERCENT HERE IS THE DETAILS AK

Cars: వామ్మో.. పాకిస్థాన్‌లో కారు కొనాలంటే కష్టమే.. భారీగా పెరిగిన పన్నులు.. ఎంతంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Car Sales: కార్లపై పన్నును వందశాతం పెంచడం వల్ల కార్ల అమ్మకాలపై భారీగా ప్రభావం పడుతుందని అక్కడి వ్యాపారవర్గాలు చెబుతున్నాయి.

    పాకిస్తాన్ ప్రజలు తమ సొంత కారు కొనడం ఇప్పుడు గతంలో కంటే చాలా కష్టం. దేశంలో కొత్త కార్ల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇందుకు అసలు కారణంగా పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టమే. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఈ కొత్త బిల్లును ఆమోదించిన తరువాత.. కార్ల రేట్లు అమాంతం పెరగడం దాదాపు ఖాయమైంది. దీనిని సాధారణంగా మినీ-బడ్జెట్ అని పిలుస్తారు. దీని కింద కార్లపై పన్నును వంద శాతం పెంచారు. పాకిస్థాన్‌లోని సింధ్ ఎక్సైజ్ పన్నుల శాఖ ఆర్థిక చట్టం 2022 ద్వారా పన్నులపై పన్నును పెంచింది. దీంతో పాకిస్తాన్‌లో వాహనాల ధరలు పెరిగాయి. ఈ బిల్లును పాక్ ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. అయినప్పటికీ ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. కొత్త బిల్లు ప్రకారం 1001 సీసీ నుంచి 2000 సీసీ వరకు ఇంజన్ కెపాసిటీ ఉన్న కార్లపై గతంలో రూ.లక్ష ఉన్న పన్నును రూ.2 లక్షలకు పెంచారు.

    అలాంటి కార్లు కొనాలంటే రూ. 4 లక్షల పన్ను
    ఇప్పుడు 2001సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ గల కారును కలిగి ఉన్న కార్ల యజమానులు 4 లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది పాకిస్థాన్ ఆటోమోటివ్ పరిశ్రమ వెన్ను విరిచే నిర్ణయమని వ్యాపారవర్గాలు భావిస్తున్నారు. ఈ కేటగిరీకి చెందిన కార్లు పాకిస్థాన్‌లో మొత్తం అమ్మకాలలో ప్రధాన వాటాను కలిగి ఉన్నాయి. సాధారణంగా పన్నుల పెరుగుదల లేదా తగ్గింపు అన్నది డిమాండ్ పెరుగుదల, తగ్గుదల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

    పాకిస్థాన్ ప్రస్తుతం భారీగా అప్పుల్లో ఉంది. అంతేకాదు దాయాది దేశంలో ద్రవ్యోల్బణం కూడా వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌లో వస్తువులు, ఇంధనాల ధరలు పెరగడంతో దేశంలోని ప్రజలు భారీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని గతంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా అంగీకరించారు.

    ఆ దేశానికి వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి ఆ కష్టాలు తీరినట్టే..

    OMG: కుక్కల పురుషాంగాలకు అక్కడ భలే డిమాండ్.. నూనెలో ఫ్రై చేసుకొని లాగిస్తారు..

    అయితే కార్లపై పన్నును వందశాతం పెంచడం వల్ల కార్ల అమ్మకాలపై భారీగా ప్రభావం పడుతుందని అక్కడి వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. కొత్త బడ్జెట్‌ను ప్రకటించే ముందు పన్నులో ఏవైనా మార్పులు చేస్తే, అది స్థానికంగా సమీకరించబడుతుందని పాకిస్థాన్‌కు చెందిన ఇండస్ మోటార్ కంపెనీ సీఈఓ అలీ అస్గర్ జమాలీ అన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం స్థానిక తయారీని ప్రోత్సహించాలని, దిగుమతి చేసుకున్న వాహనాలపై పన్నును పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Car prices, Pakistan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు