పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమం

ఆయన రక్తంలో ఒక్కరోజులోనే ప్లేట్స్ లెట్స్ 45 వేల నుంచి 25 వేలకు పడిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి ఆయన్ను డిశ్చార్జ్ చేయడం కుదరదని జైలు అధికారులకు వైద్యులు తేల్చి చెప్పారు.

news18-telugu
Updated: October 29, 2019, 11:03 PM IST
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమం
నవాజ్ షరీఫ్ (File)
  • Share this:
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, గుండెనొప్పితో ఆయన బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. రక్తంలో ప్లేట్స్ లెట్స్ కౌంట్ కనిష్ఠస్థాయికి పడిపోయిందని వారు వెల్లడించారు. ఆయన రక్తంలో ఒక్కరోజులోనే ప్లేట్స్ లెట్స్ 45 వేల నుంచి 25 వేలకు పడిపోయిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆస్పత్రి నుంచి ఆయన్ను డిశ్చార్జ్ చేయడం కుదరదని జైలు అధికారులకు వైద్యులు తేల్చి చెప్పారు. ఇటీవల షరీఫ్ కు గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్ కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ క్రమంలోనే ఆయన జైలు జీవితం గడుపుతున్నారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, తక్షణమే షరీఫ్ ను విడుదల చేయాలని ఇటీవల ఆయన మద్ధతుదారులు పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

First published: October 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com