Home /News /international /

PAKISTAN FORMER PM IMRAN KHAN FACES DISPUTED BLASPHEMY CHARGES PVN

Imran Khan : పాక్ లో కొత్త పరిణామం..ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధం!

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫొటో)

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(ఫైల్ ఫొటో)

 Imran Khan Faces Blasphemy Charges : గత నెలలో పాకిస్తాన్ ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్(Imran Khan)..ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. గత నెల పాక్ పార్లమెంట్ లో విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణంలో ఓడిపోవడంతో ప్రధాని పదవికి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...
  Imran Khan Faces Blasphemy Charges : గత నెలలో పాకిస్తాన్ ప్రధాని పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్(Imran Khan)..ఇప్పుడు కొత్త చిక్కుల్లో పడ్డారు. గత నెల పాక్ పార్లమెంట్ లో విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణంలో ఓడిపోవడంతో ప్రధాని పదవికి ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇమ్రాన్ రాజీనామాతో ఆ స్థానంలో అప్పటివరకు విపక్ష నేతగా ఉన్న షెహబాజ్ షరీఫ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుండి ఇమ్రాన్ ఖాన్-షెహబాజ్ షరీఫ్ మధ్య పాకిస్తాన్ లో మాటల యుద్ధం సాగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దైవదూషణ కేసులో ఇమ్రాన్ ఖాన్ ను మరికొద్ది రోజుల వ్యవధిలోనే పాక్ పోలీసులు అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టడానికి మతాన్ని "ఒక సాధనంగా" ఉపయోగించుకున్నందుకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ తో పాటు మరో 150 మందిపై దేశ దైవదూషణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పాకిస్తాన్ అధికారులు ఆదివారం ధృవీకరించారు. ఈ కేసులోనే ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

  అసలేం జరిగింది

  పీటీఐ పార్టీ అధినేత,పాకిస్తాన్(Pakistan)మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గతవారం సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ముస్లీంలకు మక్కా తర్వాత అత్యంత పవిత్రమైన స్థలం మదీనాలోని మస్జిద్ ఏ నబ్వీ (Al-Masjid an-Nabawi)ను సందర్శించారు. అయితే ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్‌ మద్ధతుదారులు.. పాక్ నూతన ప్రధాని షాబాజ్ షరీఫ్‌ తో పాటు ఆయన బృందానికి వ్యతిరేకంగా మసీదులో పరుష పదజాలాన్ని వాడారు. దొంగలు, కుట్రదారులు అంటూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా నేరపూరిత భాష ఉపయోగించారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు బయటికొచ్చాయి. ఈ వీడియోల ఆధారంగా పాక్ లోని పంజాబ్ రాష్ట్రంలోని ఫైజలాబాద్ లో...ఇమ్రాన్ ఖాన్‌తోపాటు పాక్ మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్, ఇమ్రాన్ వద్ద చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన షాబాజ్ గిల్‌తోపాటు మరికొందరిపై పాకిస్తాన్ శిక్షాస్మృతిలోని 295 ఏ ప్రకారం దైవదూషణ కేసు నమోదైంది. మదీనాలోని ప్రవక్త మసీదును అపవిత్రం చేయడం, గూండాయిజం, ముస్లింల మనోభావాలను దెబ్బతీయడం వంటి ఆరోపణలతో శనివారం రాత్రి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. మదీనాలోని మస్జిద్ ఏ నబ్వీ వద్ద షరీఫ్, అతని ప్రతినిధి బృందాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ వంద మందికిపైగా మద్దతుదారులను సౌదీ అరేబియాకు పంపించారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, పీటీఐ,ఇతర నామినేటెడ్ నాయకులు ఈ విషయంలో పార్టీ కార్యకర్తలకు ఆదేశాలు ఇచ్చారని ఎఫ్‌ఐఆర్‌ లో పేర్కొన్నారు.

  ALSO READ Karnataka CM Change : కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు?సుదీప్ హిందీ వ్యాఖ్యలకి బొమ్మై సపోర్ట్ చేసినందుకేనా!

  పాకిస్తాన్ నూతన అంతర్గత మంత్రి రాణా సనావుల్లా ఆదివారం ఒక ట్వీట్‌లో..ఇమ్రాన్ ఖాన్ పై దైవదూషణ ఆరోపణల కింద కేసు పెట్టడాన్ని సమర్థించారు. సౌదీ అరేబియాలో జరిగిన సంఘటన వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని అన్నారు. ఈ విషయంలో ఎవరూ తప్పించుకోలేరు మరియు చట్టం తన పనిని తీసుకుంటుంది అని మంత్రి స్థానిక టెలివిజన్ ఛానెల్‌ తో అన్నారు. సాక్ష్యాధారాలు ఈ సంఘటనతో ముడిపడి ఉంటే మాజీ ప్రధాని ఇమ్రాన్ మరియు అతని సహాయకులను అరెస్టు చేయవచ్చని సనావుల్లా తెలిపారు. కాగా మదీనాలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రధాన మంత్రి బృందానికి వ్యతిరేకంగా పరుష పదజాలం వాడినట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపించింది. నేరపూరిత భాష వాడారనే కారణంగా సౌదీ పోలీసులు ఐదుగురు పాకిస్తాన్ పౌరులను అరెస్ట్ చేశారని సౌదీ మీడియా పేర్కొంది. కాగా ఇమ్రాన్ ఖాన్ ఈ వివాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పవిత్ర స్థలం వద్ద నినాదాలు చేయాలని ఎవరికీ చెప్పే ఉద్దేశ్యం కూడా తనకులేదన్నారు.
  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Imrankhan, Pakistan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు