సార్క్ సమావేశాల్లో పాక్ ఓవర్ యాక్షన్.. భారత్ స్పీచ్ బాయ్‌కాట్

SAARC SUMMIT: సార్క్ 2019 సమావేశాలకు నేపాల్ అధ్యక్షత వహించింది.భారత్‌తో పాటు ఆఫ్ఘన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

news18-telugu
Updated: September 27, 2019, 2:58 PM IST
సార్క్ సమావేశాల్లో పాక్ ఓవర్ యాక్షన్.. భారత్ స్పీచ్ బాయ్‌కాట్
షా మహమూద్ ఖురేషీ
  • Share this:
సార్క్ సభ్య దేశాల సమావేశంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఖురేషీ మధ్యలోనే వెళ్లిపోయారు.భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పీచ్‌కు ముందు ఆయన సమావేశం నుంచి వాకౌట్ చేశారు.కశ్మీర్‌లో మిలటరీని ఉపసంహరించుకునేదాకా భారత్‌తో పాకిస్తాన్ చర్చలు జరపబోదని స్పష్టం చేశారు. ఖరేషీ వాకౌట్‌తో ఆయన లేకుండానే సార్క్ సమావేశం జరిగింది.అనంతరం సార్క్ వేదికపై జైశంకర్ మాట్లాడుతూ.. దేశాల మధ్య సత్సంబంధాలకు ఉగ్రవాదం పెద్ద అడ్డంకిగా మారిందన్నారు.ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఏరిపారేయాలని.. దేశాల మధ్య సత్సంబంధాలకు, అభివృద్దికి అది దోహదపడుతుందని అన్నారు.స్పీచ్ అనంతరం సమావేశం నుంచి వెళ్లిపోయిన జైశంకర్.. ఖురేషీతో ముఖాముఖి చర్చలకు దూరంగా ఉన్నారు.

పొరుగు దేశాల శ్రేయస్సు కోసం పురోగతి కోసం భారత్ కృషి చేస్తోంది. 2017లొ భారత్ లాంచ్ చేసిన సౌత్ ఏసియన్ శాటిలైట్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. సార్క్ పరిధిలోని దేశాల అభ్యున్నతి కోసమే భారత్ దీన్ని చేపట్టింది.
జైశంకర్,భారత విదేశాంగ మంత్రి


కాగా, సార్క్ 2019 సమావేశాలకు నేపాల్ అధ్యక్షత వహించింది.భారత్‌తో పాటు ఆఫ్ఘన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, శ్రీలంక దేశాల విదేశాంగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత ఏడాది జరిగిన సార్క్ సమావేశంలో భారత్ తరుపున విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ హాజరయ్యారు.
First published: September 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading