హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan first Hindu woman DSP : పాకిస్తాన్ లో మొట్టమొదటి హిందూ మహిళా డీఎస్పీ

Pakistan first Hindu woman DSP : పాకిస్తాన్ లో మొట్టమొదటి హిందూ మహిళా డీఎస్పీ

పాక్ లో మొదటి హిందూ మహిళా డీఎస్పీ

పాక్ లో మొదటి హిందూ మహిళా డీఎస్పీ

Pakistan first Hindu woman DSP : పాకిస్తాన్‌(Pakistan)లోని సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన"మనీషా రోపేటా(26)" పేరు ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది, ఎందుకంటే సింధ్ పోలీసులో అధికారిక స్థానాల్లో పోస్ట్ చేయబడిన కొద్దిమంది మహిళా అధికారులలో ఆమె ఒకరు.

ఇంకా చదవండి ...

Pakistan first Hindu woman DSP : పాకిస్తాన్‌(Pakistan)లోని సింధ్ ప్రావిన్స్‌లోని జాకోబాబాద్‌కు చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన"మనీషా రోపేటా(26)" పేరు ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది, ఎందుకంటే సింధ్ పోలీసులో అధికారిక స్థానాల్లో పోస్ట్ చేయబడిన కొద్దిమంది మహిళా అధికారులలో ఆమె ఒకరు. అంతేకాకుండా ఆమె పాకిస్తాన్‌లో మైనారిటీ కమ్యూనిటీ అయిన హిందూ మతానికి చెందిన మొదటి మహిళా DSP(డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) కూడా. పాకిస్తాన్ సమాజం పురుషుల ఆధిపత్యంతో ఉంటుంది,అక్కడి సంస్కృతి కూడా పురుషాధిక్యతతో ఉంటది. అటువంటి పరిస్థితిలో మనీషా రోపేట పోలీసు ఉద్యోగంలో చేరడమే కాదు, అధికారి స్థాయికి చేరుకోవడం చరిత్రాత్మకం.

సింధ్‌ ఫ్రావిన్స్ లోని జాకోబాబాద్ ప్రాంతానికి చెందిన మనీషా రోపెటా(Manisha Ropeta) చిన్నతనం గురించి తన ఎలా పోరాడుతూ ఈ స్థాయికి చేరుకుందో మాట్లాడుతూ.." చిన్నప్పటి నుండి, నా సోదరీమణులు, నేను పాత పితృస్వామ్య వ్యవస్థను చూశాము. ఆడపిల్లలు చదువుకుని ఉద్యోగం చేయాలనుకుంటే టీచర్లు లేదా డాక్టర్లు మాత్రమే అవుతారని ఎక్కడ చెప్పారు. మహిళలు మన సమాజంలో అత్యంత అణచివేతకు గురవుతున్నారు,వారు అనేక నేరాలకు గురి అవుతున్నారు. అందుకే పోలీస్‌ ఉద్యోగంలో చేరాను. ఎందుకంటే మన సమాజంలో రక్షకులుగా మహిళలు అవసరమని నేను భావిస్తున్నాను. సీనియర్ పోలీసు అధికారిగా పని చేయడం నిజంగా మహిళలకు సాధికారతనిస్తుందని, వారి హక్కులను బలోపేతం చేస్తుందని భావిస్తున్నాను. మహిళా సాధికారత కోసం జరుగుతున్న క్యాంపెయిన్ కి నేను నాయకత్వం వహించాలనుకుంటున్నాను. దీంతో పాటు, నేను పోలీసుల్లో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. నేను పోలీసు పని పట్ల చాలా స్ఫూర్తిని పొందాను, ఆకర్షితురాలియ్యాను"అని డీఎస్పీ రోపేట అని తెలిపారు. రోపెటా ప్రస్తుతం ట్రైనింగ్ పొందుతోంది. నేరాలు ఎక్కువ ఉండే లియారీ ప్రాంతంలో ఆమె పోస్ట్ చేయబడింది.

Presidential Places : ప్రపంచంలోని 10 అద్భుతమైన రాష్ట్రపతి భవనాలు ఇవే

కాగా,రొపేటా ముగ్గురు సోదరీమణులు అందరూ డాక్టర్లు. ఆమె తమ్ముడు కూడా మెడిసిన్ చదువుతున్నాడు. అలాంటప్పుడు డాక్టర్ వృత్తిలో ఉండాలని కాకుండా వేరొక వృత్తిని ఎంచుకోవడానికి ఆమెను ప్రేరేపించిందేమిటి అని రొపేటా(First Hindu Woman DSP In Pakistan)ని అడిగినప్పుడు...నేను ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షల్లో ఒక మార్కు ఫెయిల్ అయ్యాను. నేను ఫిజికల్ థెరపీలో డిగ్రీ తీసుకుంటున్నానని నా కుటుంబానికి చెప్పాను, కానీ అదే సమయంలో నేను సింధ్ పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ పరీక్షలకు సిద్ధమయ్యాను. 468 మంది అభ్యర్థులలో 16వ స్థానంలో సాధించాను"అని తెలిపింది. రోపేట తండ్రి జాకోబాబాద్‌లో వ్యాపారి. రొపేటా 13 సంవత్సరాల వయస్సులో అతను మరణించాడు, తర్వాత ఆమె తల్లి తన పిల్లలను కరాచీకి తీసుకువచ్చి పెంచింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Dsp, Pakistan

ఉత్తమ కథలు