భారత్‌తో జరిగేది అణుయుద్ధమే...పాకిస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

భారత్ తో జరిగేది ఇక అణు యుద్ధమే అంటూ బెదిరించారు. భారత్‌తో ఇక మిలిటరీ యుద్ధం ఉండదన్నారు. తమ వద్ద అణు వార్ హెడ్లు కలిగిన మిసైల్స్ ఉన్నాయని అవి లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలవని అన్నారు.

news18-telugu
Updated: October 22, 2019, 10:47 PM IST
భారత్‌తో జరిగేది అణుయుద్ధమే...పాకిస్థాన్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్
  • Share this:
ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాకిస్థాన్ కంటి మీద కునుకు లేకుండా అయ్యింది. దీంతో ఏం చేయాలో పాలుపోక పాకిస్థాన్ నేతలు నోటికి వచ్చినట్లు వాగుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కు చెందిన ఓ మంత్రి షేక్ రషీద్ వివాదాస్పద రీతిలో భారత్‌ను హెచ్చరించారు. భారత్ తో జరిగేది ఇక అణు యుద్ధమే అంటూ బెదిరించారు. భారత్‌తో ఇక మిలిటరీ యుద్ధం ఉండదన్నారు. తమ వద్ద అణు వార్ హెడ్లు కలిగిన మిసైల్స్ ఉన్నాయని అవి లక్ష్యాన్ని కచ్చితంగా ఛేదించగలవని అన్నారు. అయితే రషీద్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకూ పాకిస్థాన్ ప్రభుత్వం తరపున ఎవరూ స్పందించలేదు. కాగా రషీద్ గతంలో కూడా ఇటువంటి హెచ్చరికలు చేశారు. అక్టోబరులో భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగుతుందన్నారు. ఆయన తరచూ ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం అలవాటుగా చేసుకున్నారు. ఇదిలావుండగా, పాకిస్థాన్ సైన్యం నియంత్రణ రేఖ వెంబడి బలగాలను మోహరిస్తోంది. యుద్ధ ట్యాంకులను కూడా సరిహద్దులకు తరలిస్తోంది. సైనికుల సంఖ్యను పెంచుతోంది.
Published by: Krishna Adithya
First published: October 22, 2019, 10:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading