F-16 shot down proof : పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్...ఎఫ్-16 కూలిన సాక్ష్యాలివిగో...

ఫిబ్రవరి 27,2019న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని ఐఎఎఫ్ మిగ్ 21 బైసన్ కూల్చిన సాక్ష్యాలను ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్ విడుదల చేశారు. ఎఫ్ 16 విమానాన్ని కూల్చినట్లు నిర్ధారించే.. రాడార్ ఇమేజీలను విడుదల చేశారు.

news18-telugu
Updated: April 8, 2019, 8:55 PM IST
F-16 shot down proof : పాకిస్థాన్‌కు భారత్ దిమ్మతిరిగే కౌంటర్...ఎఫ్-16 కూలిన సాక్ష్యాలివిగో...
ఫిబ్రవరి 27,2019న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని ఐఎఎఫ్ మిగ్ 21 బైసన్ కూల్చిన సాక్ష్యాలను ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్ విడుదల చేశారు. ఎఫ్ 16 విమానాన్ని కూల్చినట్లు నిర్ధారించే.. రాడార్ ఇమేజీలను విడుదల చేశారు.
  • Share this:
కెప్టెన్ అభినందన్ కూల్చింది ఎఫ్‌16 విమానం కాదని ఇంతకాలం బుకాయిస్తూ వస్తున్న పాకిస్థాన్‌ను భారత వాయుసేన తలదించుకునేలా చేసింది. ఫిబ్రవరి 27,2019న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16 విమానాన్ని ఐఎఎఫ్ మిగ్ 21 బైసన్ కూల్చిన సాక్ష్యాలను ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్ విడుదల చేశారు. ఎఫ్ 16 విమానాన్ని కూల్చినట్లు నిర్ధారించే.. రాడార్ ఇమేజీలను విడుదల చేశారు. అలాగే కూలిన ఎఫ్ 16 విమానానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ సిగ్నేచర్, రేడియో ట్రాన్స్ క్రిప్ట్స్ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉంచుతున్నట్లు కపూర్ తెలిపారు.

ఇటీవల అమెరికాకు చెందిన ఫారిన్ పాలసీ పత్రిక రిపోర్ట్ చేస్తూ.. భారత వాయు సేన కూల్చింది ఎఫ్ 16 కాదని పేర్కొంది. పాకిస్థాన్ కు అమెరికా సరఫరా చేసిన ఎఫ్ 16 విమానాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, అమెరికాకు చెందిన రక్షణవిభాగం విమానాలను లెక్కించుకొని వెళ్లిందని తెలిపింది. దీన్నే ఆధారంగా చేసుకొని పాకిస్తాన్ ఎఫ్ 16 కూలలేదని బుకాయిస్తూ వచ్చింది. ఫిబ్రవరి 27న జరిగిన సంఘర్షణలో ఎఫ్ -16 విమానం నౌషేరా సెక్టార్ లో కూలిందని కపూర్ పేర్కొన్నారు. కెప్టెన్ అభినందన్ మిగ్ బైసన్ విమానంతో ఎఫ్ 16ను వెంటాడి కూల్చగా, ఈ ఘటనలో మిగ్ విమానం సైతం కూలి అభినందన్ పాక్ భూభాగంలో ల్యాండ్ అయినట్లు కపూర్ తెలిపారు.




First published: April 8, 2019, 7:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading