దేశ గూఢచార సంస్థకు గట్టి వార్నింగ్ ఇస్తూ, పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ నిఘా వ్యవస్థకు వార్నింగ్ ఇచ్చారు. 'తాను ఐఎస్‌ఐని బట్టబయలు చేయగలనని, కానీ దేశ అభివృద్ధి కోసం అలా చేయకూడదని అన్నారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్(Imran khan) ర్యాలీలో ఈ విషయం చెప్పారు. PTI లాహోర్‌లోని లిబర్టీ చౌక్ నుండి ఇస్లామాబాద్(Islamabad) వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హక్కీ ఆజాదీ లాంగ్ మార్చ్‌ను ప్రారంభించింది.డీజీ ఐఎస్‌ఐ (ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ నదీమ్ అంజుమ్) చెవులు విప్పి వినాలన్న ఇమ్రాన్.. తనకు చాలా విషయాలు తెలుసని అన్నారు. కానీ నా దేశానికి హాని చేయకూడదనుకోవడం వల్లనే మౌనంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. అభివృద్ధి కోసం నిర్మాణాత్మక విమర్శలు చేస్తున్నానని చెప్పారు.
ఇమ్రాన్ ఖాన్, ఐఎస్ఐ మధ్య పోటీ పెద్ద సమస్యగా మిగిలిపోయింది. ఐఎస్‌ఐ మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను ఆర్మీ తదుపరి చీఫ్‌గా నియమించేందుకు అప్పటి ప్రతిపక్ష కూటమి భయపడుతోందని ఇమ్రాన్ ఖాన్ అంతకుముందు చెప్పారు. లెఫ్టినెంట్ జనరల్ ఫైజ్ హమీద్‌ను నియమించాలని వాళ్లు భయపడ్డారని... ఇలా జరిగితే తమ భవిష్యత్తు పాడవుతుందని ఆందోళన చెందారని ఇమ్రాన్ ఆరోపించారు.
తాను ఎవరినీ లెఫ్టినెంట్ జనరల్‌గా నియమించాలని ఎప్పుడూ అనుకోలేదని.. యోగ్యత లేని నిర్ణయం నేనెప్పుడూ తీసుకోలేదని వ్యాఖ్యానించారు. ఇక ఉక్రెయిన్ యుద్ధం మధ్య పాశ్చాత్య ఒత్తిడి ఉన్నప్పటికీ భారతదేశం స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రష్యా చమురును న్యూఢిల్లీ కొనుగోలు చేయడాన్ని ఇమ్రాన్ ఖాన్ మరోసారి ప్రశంసించారు.
భారతదేశం ఇష్టానుసారంగా రష్యా నుండి చమురును దిగుమతి చేసుకోగలదని, పాకిస్థానీలు తమ దేశ ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైన బానిసలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, Pakistan