హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

కోర్టులో నవాజ్ షరీఫ్ కుమార్తె కు ఊరట.. ఏడేళ్ల జైలు శిక్షను రద్దు చేసిన పాక్ కోర్టు..

కోర్టులో నవాజ్ షరీఫ్ కుమార్తె కు ఊరట.. ఏడేళ్ల జైలు శిక్షను రద్దు చేసిన పాక్ కోర్టు..

మరియమ్ నవాజ్ (ఫైల్)

మరియమ్ నవాజ్ (ఫైల్)

Pakistan: ఆస్తుల సమాచారాన్ని దాచిపెట్టిన కేసులో మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియమ్‌ నవాజ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించడాన్ని పాకిస్థాన్‌ కోర్టు ఈరోజు రద్దు చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Goa, India

పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియమ్ నవాజ్ (Maryam Nawaz) లండన్ లో విలాసవంతమైన అపార్ట్ మెంట్ కొనుగోలు చేసింది. అయితే.. దీనిలో నవనాజ్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో.. ప్రాసిక్యుషన్ లో రుజువు చేయడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఇద్దరు న్యాయమూర్తుల ప్యానెల్ గుర్తించిందని న్యాయవాది అమ్జద్ పర్వైజ్ తెలిపారు. ఆస్తులను కొనుగోలు చేసినందుకు తెలిసిన ఆదాయ వనరులను వెల్లడించనందుకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించిన ఆమె తండ్రితో (Nawaz Sharif) పాటు ఆమె 2018లో అక్రమాస్తుల నిరోధక కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. కాగా, తన తండ్రికి చెందిన ఆస్తుల సమాచారాన్ని దాచిపెట్టినందుకు మరియమ్ నవాజ్‌పై ప్రాసిక్యూషన్ అభియోగాలు మోపింది. ప్రస్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు.

ఆమె పార్టీ రాజకీయ బలిపశువుగా మారిందని, ఆమెపై ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, నేరారోపణను రద్దు చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసింది. పాకిస్తాన్ చట్టాల ప్రకారం, దోషిగా తేలిన రాజకీయ నాయకుడు ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. శక్తివంతమైన మిలిటరీతో తీవ్రమైన విభేదాలు రావడంతో ఆమె తండ్రి 2017లో ప్రభుత్వం నుండి తొలగించబడ్డారు.

షరీఫ్ కుటుంబానికి చెందిన లండన్‌లోని అవెన్‌ఫీల్డ్ ఆస్తుల జాబితా పనామా పేపర్స్ పత్రం లీక్ కావడంతో అవినీతి కేసులు బయటపడ్డాయి. సైన్యం మద్దతుతో కోర్టుల్లో కల్పిత కేసులతో తనను ఇరికించారని షరీఫ్ ఆరోపించారు. మరోవైపు ఈ ఆరోపణలను సైన్యం ఖండించింది.

ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా(Australia)కు చెందిన బార్ అటెండర్ డాన్ సాండర్స్..ఒక రోజు రాత్రి మద్యం సేవించి ఏటీఎం నుంచి రూ.10వేలు విత్ డ్రా చేసుకునేందుకు ఇంటి ఇంటి నుండి బయలుదేరి వెళ్లాడు.

ఏటీఎంలో లావాదేవీ రద్దు సందేశం వచ్చింది. అయితే నగదు రావడం మొదలైంది. ATM లోపాన్ని తెలుసుకున్న అతను రూ. 68,000 విత్‌డ్రా చేయడానికి మళ్లీ ప్రయత్నించగా ఈసారి కూడా అతనికి డబ్బు వచ్చింది. మొదట తన బ్యాంక్ ఖాతాలో ఏదో పొరపాటు జరిగినట్లు భావించాడు, కానీ ఆ తర్వాత బ్యాంకు చేసిన తప్పును గుర్తించడానికి అతడికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ తర్వాత అతను ATM లోపాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అలా 5 నెలల్లో రూ. 9 కోట్లు ఆ ఏటీఎం నుంచి తీసుకున్నాడు. ఆశ్చర్యకరంగా, ఈ సమయంలో అతని బ్యాంకు ఖాతా నుండి ఒక్క రూపాయి కూడా తీసివేయబడలేదు, అతనికి నగదు వస్తూనే ఉంది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Nawaz sharif, Pakistan

ఉత్తమ కథలు