నవాజ్ షరీఫ్‌కు బిగ్ రిలీఫ్... మళ్లీ విదేశాలకు...

నవాజ్ రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతున్నాయని... మెరుగైన వైద్యం కోసం లండన్ వెళ్లాలని వైద్యులు సూచించారు.

news18-telugu
Updated: November 17, 2019, 11:15 AM IST
నవాజ్ షరీఫ్‌కు బిగ్ రిలీఫ్... మళ్లీ విదేశాలకు...
నవాజ్ షరీఫ్ (File)
  • Share this:
అవినీతి ఆరోపణలు, మనీలాండరింగ్ సహా వివిధ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం అనుభవిస్తున్న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు లాహోర్ కోర్టులో ఊరట లభించింది. చికిత్స కోసం లండన్ వెళ్లేందుకు లాహోర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొద్దిరోజులగా అనారోగ్యంతో బాధపడుతున్న నవాజ్ షరీఫ్... పాక్‌లోనే చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. నవాజ్ రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తగ్గిపోతున్నాయని... మెరుగైన వైద్యం కోసం లండన్ వెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో నవాజ్ షరీష్ తరుపున న్యాయవాది బెయిల్ కోసం కోర్టు అభ్యర్థించారు.

దీంతో ఆయనకు నాలుగు వారాలు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నామని చికిత్స అనంతరం తిరిగి స్వదేశానికి తిరిగి రావాలని కోర్టు స్పష్టం చేసింది. విదేశాలకు వెళ్ళకుండా నిషేదం విధించిన జాబితా నుంచి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పేరును తొలిగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రెండు రోజుల్లో నవాజ్ షరీఫ్ లండన్ వెళ్లనున్నారు. షరీష్ ఆరోగ్యం కుదుటపడకపోతే మరింతకాలం కోర్టు గడువు పొడిగించే అవకాశాలు ఉన్నాయని ఆయన తరపున వాదించిన న్యాయవాది తెలిపారు.


First published: November 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>