హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan: నాపై దాడి వెనుక ఆ ముగ్గురు.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Pakistan: నాపై దాడి వెనుక ఆ ముగ్గురు.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)

ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)

Imran Khan: ముగ్గురు వ్యక్తులు కలిసి తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఇమ్రాన్ అన్నారు. ఈ ముగ్గురి పేర్లలో రానా సన్నావుల్లా, షాబాజ్ షరీఫ్, మేజర్ జనరల్ ఫైసల్ ఉన్నారని అన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తనపై దాడి తర్వాత పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేశారు. తనపై దాడి జరుగుతుందని ముందే తెలుసునని అన్నారు. తనపై రెండు వైపుల నుంచి నాలుగు బుల్లెట్లు దూసుకెళ్లాయని.. ఆ బుల్లెట్లన్నీ తగిలి ఉంటే తప్పించుకోవడం కష్టమే అన్నారు. దాడి కేసులో పట్టుబడ్డ వ్యక్తి ఒక్కరే కాదని.. అనేక మంది ప్రమేయం ఉందని ఆరోపించారు. నిన్న వజీరాబాద్‌లో(Vajirabad) జరిగిన ఘటనను ప్రస్తావించిన ఇమ్రాన్ (Imran Khan).. ముగ్గురు వ్యక్తులు కలిసి తనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఇమ్రాన్ అన్నారు. ఈ ముగ్గురి పేర్లలో రానా సన్నావుల్లా, షాబాజ్ షరీఫ్, మేజర్ జనరల్ ఫైసల్ ఉన్నారని అన్నారు. మూసి ఉన్న గదిలోనే తనపై దాడికి కుట్ర పన్నారని ఆరోపించారు. తన వద్ద ఓ వీడియో క్లిప్ ఉందని ఇమ్రాన్ తెలిపాడు. తనకు ఏదైనా జరిగితే ఆ వీడియోను బయటపెట్టాలని ఆయన తన మద్దతుదారులకు సూచించారు.

ప్రజాప్రతినిధులు ఎక్కడ నిలబడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. తన ఎంపీలను బెదిరిస్తున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఖాన్ అన్నారు. అవినీతి కేసులు, పాత వీడియోలపై బ్లాక్ మెయిల్ చేస్తున్నారని తెలిపారు. కానీ ప్రజలు తనను ప్రోత్సహించారని చెప్పారు. జనరల్ ఫైజల్ తమపై కఠినత్వాన్ని పెంచాడని ఆరోపించారు. తమ పార్టీ అంతం అవుతుందని ఇంతమంది అనుకున్నారని.. కానీ దిగుమతి చేసుకున్న ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. తనను ఎన్నికల్లో ఓడించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారని.. ఇందుకు ఎన్నికల సంఘం కూడా ఆయనకు సహకరించిందని ధ్వజమెత్తారు.

ఈవీఎం మెషీన్ల ద్వారా ఓటు వేయాలని తాము సూచించామని.. కానీ తమ సూచన ఆమోదించబడలేదని అన్నారు. తమ పార్టీకి చెందిన దాతను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రజాధనంతో తమ పార్టీ పనిచేస్తుందని.. తమ దాత పారిపోయేలా వేధిస్తున్నారని ఆరోపించారు. తమపై ఆరోపణలు చేసే ముందు మీ పార్టీ గురించి, వారికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

China: చైనాలో కఠినంగా జీరో కోవిడ్‌ పాలసీ..లాక్‌డౌన్స్‌పై బాలీవుడ్‌ సాంగ్స్‌తో చైనీయుల నిరసన

Twitter Layoffs: ట్విట్టర్ ఉద్యోగులకు మస్క్ షాక్.. శుక్రవారం నుంచి భారీగా ఉద్యోగుల తొలగింపు..

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ను కూడా ఇమ్రాన్ ఖాన్ టార్గెట్ చేశారు. మనీలాండరింగ్‌ ద్వారా పర్వేజ్‌ ముషారఫ్‌ డబ్బును దేశం నుంచి తీసుకెళ్లారని తెలిపారు. ఇంగ్లండ్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో ముషారఫ్‌కు నాలుగు విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయని ఆయన చెప్పారు. ఇంత అపారమైన సంపద ఎక్కడి నుంచి వచ్చిందని వారిని అడగాలని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

First published:

Tags: Imran khan, Pakistan

ఉత్తమ కథలు