Home /News /international /

PAKISTAN EARTHQUAKE EARTHQUAKE OF MAGNITUDE 6 OCCURRED TODAY NEAR HARNAI PAKISTAN SK

Pakistan Earthquake: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. భవనాలు కూలి 20 మందికి పైగా మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pakistan earthquake: భూకంపం ధాటికి హర్నాయ్ నగరంలో పలు చోట్ల ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోయాయి. వాటి కింద చిక్కుకొని ఎంతో మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు.

    పాకిస్తాన్‌ (Pakistan)ను భారీ భూంకంపం (Earthquake) వణికించింది. గురువారం తెల్లవారుఝామున హర్నాయ్ ప్రాంత సమీపంలో భూమి కంపించింది. క్వెటా (Quetta) నగరానికి తూర్పు-ఈశాన్య దిశగా 12 కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని తీవ్ర 5.7గా ఉందని యూరోపియన్ మెడిటేరియన్ సెస్మలాజికల్ సెంటర్ (EMSC) , అమెరికాకు చెందిన యూఎస్ జియోలాజికల్ సర్వే  (USGS)  పేర్కొనగా.. భారత్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (National Center for Seismology) మాత్రం 6.0గా వెల్లడించింది. భూకంపం ధాటికి పలు చోట్ల భవనాలు కూలిపోయింది. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 20 మందికి పైగా మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. మృతుల్లో ఆరుగురు పిల్లలు, ఓ మహిళ ఉన్నారని స్థానిక మంత్రి మీర్ జియా ఉల్లా తెలిపారు. ఇప్పటి వరకు 20 మంది మృతి గురించి సమాచారం ఉందని.. వీరి సంఖ్య మరింతగా పెరిగే అకాశముందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపారు. హర్నాయ్ నగరంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు.



    వామ్మో.. అమెరికా దగ్గర ఇన్ని అణు బాంబులా! -అధికారిక ప్రకటన -ఈ లెక్కన నార్త్ కొరియా జుజుబీనే..

    భూకంపం ధాటికి హర్నాయ్ నగరంలో పలు చోట్ల ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోయాయి. వాటి కింద చిక్కుకొని ఎంతో మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. హర్నాయ్ నగరం బలూచిస్తాన్‌లో ఉంటుంది. అది కొండ ప్రాంతం కావడంతో సరైన మౌలిక సదుపాయలు లేవు. సరైన రోడ్లు, విద్యుత్, మొబైల్ నెట్‌వర్క్ లేకపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బలూచిస్తాన్ రాజధాని క్వెటాలోని భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే అక్కడ మాత్రం దాని ప్రభావం తక్కువగానే ఉందని చెప్పారు. భూకంపం తర్వాత పరిస్థితిని చాలా మంది ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

    Shocking: చర్చిలో పాడుపని... 3లక్షల మంది చిన్నారులపై లైంగిక వేధింపులు... సంచలన నివేదిక





    Couple: ఆ వీడియోలను అమ్ముకుని నెలకు రూ.30 లక్షలు సంపాదించారు..

    గతంలోనూ పలు భూకంపాలు పాకిస్తాన్‌లో విధ్వంసం సృష్టించాయి.2015 అక్టోబరులో పాకిస్తాన్, అప్ఘానిస్తాన్‌లో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. అప్పుడు దాదాపు 400 మంది మరణించారు. 2005లో 7.6 తీవ్రతతో సంభవించిన భూంకంపం వేలాది మందిని బలితీసింది. ఏకంగా 73వేల మంది మరణించారు. దాదాపు 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. పాకిస్తాన్ చరిత్రలోనే అతిపెద్ద భూకంపంగా దీనిని పేర్కొంటారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Earth quake, Earthquake, International news, Pakistan

    తదుపరి వార్తలు