భారత్‌తో ఇక తెగదెంపులే...పాకిస్తాన్ ప్రధాని కీలక నిర్ణయం

కశ్మీర్ విషయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరును ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్తామని ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు.

news18-telugu
Updated: August 8, 2019, 8:43 AM IST
భారత్‌తో ఇక తెగదెంపులే...పాకిస్తాన్ ప్రధాని కీలక నిర్ణయం
ఇమ్రాన్ ఖాన్
news18-telugu
Updated: August 8, 2019, 8:43 AM IST
ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజనను దాయాది పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది. అంతర్జాతీయ వేదికగా భారత్‌పై విషం చిమ్మేందుకు కుట్రలు చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్ నుంచి భారత రాయబారిని బహిష్కరించింది. అటు ఇండియాలోని పాకిస్తాన్ రాయబారిని వెనక్కి పిలిపించేందుకు సిద్ధమైంది పాక్. అంతేకాదు భారత్‌తో దౌత్య సంబంధాలను తగ్గించుకోవడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయడంతో పాటు ద్వైపాక్షిక ఒప్పందాలను పునసమీక్షించాలని నిర్ణయించింది.

కశ్మీర్ విషయంలో భారత్ వ్యవహరిస్తున్న తీరును ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్తామని ఇమ్రాన్ ఖాన్ స్పష్టంచేశారు. ఆగస్టు 15 (భారత స్వాతంత్ర్య దినోత్సవం)ని బ్లాక్‌డేగా జరుపుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి పాక్ విదేశాంగమంత్రి, రక్షణమంత్రి,ఐఎస్ఐ డీజీ, ఐఎస్‌పీఆర్ డీజీతో పాలు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పాకిస్తాన్ భద్రతా కమిటీ జాతీయ సమావేశం


First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...