PAKISTAN DIGITAL BODY WARNS OF INTERNET SHUTDOWN AMID POWER CUTS THEN DELETES TWEET PVN
Pakistan power crisis : పాక్ లో నో పవర్..మొబైల్,ఇంటర్నెట్ సేవలు బంద్!
(ప్రతీకాత్మక చిత్రం)
Power Cuts In Pakistan : పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. దేశవ్యాప్తంగా గంటల తరబడి కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. పాక్ దేశ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో విద్యుత్ కోతలు ఎదుర్కొవడం ఇదే ప్రథమం.
Power Cuts In Pakistan : పాకిస్తాన్(Pakistan) లో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. దేశవ్యాప్తంగా గంటల తరబడి కరెంట్ కోతలు కొనసాగుతున్నాయి. పాక్ దేశ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో విద్యుత్ కోతలు(Power Cuts)ఎదుర్కొవడం ఇదే ప్రథమం. విద్యుత్తు సంక్షోభం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మొబైల్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి. తీవ్ర విద్యుత్ సంక్షోభం నడుమ.. పాకిస్తాన్ లో ఇంటర్నెట్ బంద్ హెచ్చరికలు జారీ అయ్యాయి. విద్యుత్ సంక్షోభం తీవ్రమవడంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తామని పాక్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు (NITB)హెచ్చరించింది. గంటల తరబడి విద్యుత్ కోతలు వెంటాడుతుండటంతో టెలికాం ఆపరేటర్ల సేవలపై ప్రభావం పడుతోందని, దీంతో మొబైల్, ఇంటర్నెట్ సేవలను మూసివేస్తామని టెలికాం ఆపరేటర్లు చెబుతున్నారని ఎన్ఐటీబీ ట్విట్టర్లో పేర్కొంది. అయితే కొద్దిసేపటి తర్వాత ట్విట్టర్ నుంచి ఈ ట్వీట్ ని NITB తొలగించింది
ఇక విద్యుత్ సంక్షోభం మునుముందు మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రధాని షెహబాబ్ షరీఫ్ ముందస్తు ప్రకటనలు చేయడం గమనార్హం. ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) సరఫరా ఇబ్బందికరంగా మారిందని, అయితే ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నామని ఆయన వెల్లడించారు. షహబాజ్ షరీఫ్ సోమవారం మాట్లాడుతూ...జూలై నుంచి లోడ్ షెడ్డింగ్ పెరుగుతుందని హెచ్చరించారు. లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) అవసరమైన పరిమాణంలో సరఫరాకావడం లేదని, దీని కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. మరోవైపు మునుపెన్నడూ లేని విధంగా జూన్ నెలలో నాలుగు ఏళ్ల తర్వాత అధికంగా చమురు ఇంధనాలను పాక్ దిగుమతి చేసుకుంది.
మరోవైపు విద్యుత్ వినిమయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను తగ్గంచడంతో పాటు కరాచీ సహా పలు నగరాల్లో ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్‌ను త్వరగా మూసివేయాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్తాన్లో వడగాడ్పులు,అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంంది.వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సహజవాయువు విషయంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. మూడేండ్ల నుంచి పదేండ్ల వరకూ ఎల్ఎన్జీ సరఫరాల కోసం ఖతార్‌తో ఒప్పందం చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని ఆర్ధిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ తెలిపారు. ఇక, నిత్యావసరాల ధరలు మండుతుండటంతో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం ఆరేండ్ల గరిష్టస్ధాయిలో జులైలో రెండంకెలకు చేరుకుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.