పాకిస్థాన్ కుట్ర.. సరిహద్దుల్లోకి 20,000 బలగాలు

సరిహద్దుల్లో భారత్‌ను కవ్వించేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు గిల్గిత్- బల్తిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ పెద్ద ఎత్తున బలగాలను తరలించడం సరికొత్త అనుమానాలకు తావిస్తోంది.

news18-telugu
Updated: July 1, 2020, 10:50 AM IST
పాకిస్థాన్ కుట్ర.. సరిహద్దుల్లోకి 20,000 బలగాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత్, చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాల కమాండర్ స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే సరిహద్దుల్లో భారత్‌ను కవ్వించేందుకు పాకిస్థాన్ సిద్ధమవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు గిల్గిత్- బల్తిస్థాన్ సరిహద్దుల్లో పాకిస్థాన్ పెద్ద ఎత్తున బలగాలను తరలించడం సరికొత్త అనుమానాలకు తావిస్తోంది. బాలాకోట్ వైమానిక దాడుల తరువాత కూడా తమ సరిహద్దుల్లో ఈ స్థాయిలో బలగాలను మోహరించలేదు.

ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి ఏదో కుట్రకు తెరలేపుతోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చైనా ఆర్మీ పాకిస్థాన్‌కు చెందిన టెర్రరిస్ట్ గ్రూప్ అల్ బర్ద్‌తోనూ చర్చలు జరుపుతున్నట్టు సమాచారం రావడంతో... భారత్ మరింత అప్రమత్తమైంది.

First published: July 1, 2020, 10:50 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading