హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

పరేషాన్ లో పక్క దేశం.. రూ. 2.06 లక్షలకు తులం బంగారం.. ఆందోళనలో ప్రజలు..

పరేషాన్ లో పక్క దేశం.. రూ. 2.06 లక్షలకు తులం బంగారం.. ఆందోళనలో ప్రజలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Pakistan: ప్రజలు నిత్యవసర వస్తువులు కొనడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు ధరలు పెరిగిపోతుండటంతో, పాక్ ప్రస్తుతం దివాళ తీసే పరిస్థితికి చేరుకుంటుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

పాకిస్థాన్ కొన్ని నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. ఇప్పటికే అక్కడ నిత్యవసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అదే విధంగా ప్రస్తుతం విదేశీ దిగుమతులు కూడా తగ్గినట్లు తెలుస్తోంది. తమ దేశానికి ఆపన్న హస్తం అందించాలంటూ పాక్.. ప్రస్తుతం పాక్ విదేశాలవైపు చూస్తున్నాయి. అక్కడ ప్రస్తుతం నిత్యవసరాల ధరలు.. సాధారణం కంటే నాలుగింతలు ఎక్కువ రేటుకు చేరుకున్నాయి. అంతే కాకుండా కేజీ చికెన్ 800కు పైగా అమ్ముతున్నారు. ఇక పెట్రోల్, డిజీల్ ధరలు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.

కొన్ని చోట్ల పెట్రోల్ 300కు పైన విక్రయిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా అంతర్జాతీయంగా పాక్ కరెన్సీ పడిపోవడం తీవ్ర ఆందోళన కల్గిస్తుంది. అదే విధంగా లీటర్ పాల ధర కూడా ఏకంగా 250 వరకు చేరింది. విదేశీ దిగుమతులు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ప్రజలు తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

అంతర్జాతీయ ద్రవ్యనిధి, వరల్డ్ బ్యాంక్ తమకు సహాయం అందించాలని కూడా పాక్ ప్రభుత్వం కోరింది. అంతేకాకుండా పాక్ లో ప్రస్తుతం గోల్డ్ రేటు మాత్రం ఒక రేంజ్ లో పెరిగింది. తులం బంగారం ధర అక్కడ రూ. 2.06 లక్షలకు (పాక్ కరెన్సీలో)

చేరినట్లు తెలుస్తోంది. ఈ విధంగానే మరిన్ని నెలలు కొనసాగితే పాక్ కూడా శ్రీలంక మాదిరిగా దివాళ తీస్తుందని పలువురు ఆందోళన చెందుతున్నారు.

అక్కడ పనులు దొరక్క, తినడానికి సరిపడ వస్తువులను కొనలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైన సహాయం చేస్తారా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. అక్కడ కనీసం కొన్ని చోట్ల కడుపునిండా తిండి కూడా దొరకని దీనావస్థకు ప్రజలు చేరుకున్నారు. ప్రజలంతా రోడ్లపైకి చేరుకుని నిరసన తెలియజేస్తున్నారు. మరోవైపు పాక్ అధికారులు, నేతలు దిద్దుబాటు చర్యలు చేపట్టిన కూడా ప్రస్తుతం దేశం పరిస్థితి మాత్రం ఆర్థిక పతానవస్థకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Inflation, Pakistan, VIRAL NEWS

ఉత్తమ కథలు