ఆ విద్యాలయం ఇప్పుడు హిందూ దేవాలయం...పాకిస్తాన్ కీలక నిర్ణయం

ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. 25 ఏళ్ల తర్వాత స్కూల్ భవనాన్ని హిందూ దేవాలయంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఆ స్కూల్లో చదివే విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పిస్తున్నామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

news18-telugu
Updated: February 10, 2019, 3:24 PM IST
ఆ విద్యాలయం ఇప్పుడు హిందూ దేవాలయం...పాకిస్తాన్ కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: February 10, 2019, 3:24 PM IST
పాకిస్తాన్‌లో మైనార్టీల హక్కులను కాలరాస్తున్నారు. హిందువులపై వేధింపులకు పాల్పడుతున్నారు. పాక్ అతివాదులపై చాలా కాలంగా వినిపిస్తున్న ఆరోపణలు ఇవి..! ప్రభుత్వాలు మారినా... తమను పట్టించుకునే వారేలేరని ఆవేదన వ్యక్తంచేస్తుంటారు అక్కడి అల్పసంఖ్యాక ప్రజలు. హిందూ దేవాలయాలపై విధ్వంసం జరుగుతోందని... హిందువులు ఉండే ప్రాంతాలను అభివృద్ధి చేయడం లేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఊహించని నిర్ణయం వెలువడింది. ఓ హిందూ దేవాయలయంలో నడుస్తున్న ప్రైమరీ స్కూల్‌ను మూసివేస్తూ.. అక్కడ హిందువులు పూజలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

నౌషెరా ప్రాంతంలోని రిసాల్‌పూర్‌లో 25 ఏళ్ల క్రితం ఓ హిందూ దేవాలయం ఉండేది. ఐతే అక్కడ పిల్లలు చదువుకునేందుకు స్కూల్ లేకపోవడంతో..అప్పటి ప్రభుత్వం హిందూ దేవాలయాన్ని స్వాధీనం చేసుకొని పాఠశాల ప్రారంభించింది. ఆరు నెలల పాటు మాత్రమే పాఠశాల నిర్వహిస్తామని..కొత్త స్కూల్ భవనం సిద్ధమయ్యాక విద్యార్థులను తరలిస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది. కానీ ఆ తర్వాత స్కూల్ భవనం కట్టకపోవడంతో హిందూ దేవాలయంలోనే స్కూల్ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చాలా కాలంగా హిందూ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఆ టెంపుల్‌ని హిందువులకు అప్పగించి... ప్రార్థనలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. 25 ఏళ్ల తర్వాత స్కూల్ భవనాన్ని హిందూ దేవాలయంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఆ స్కూల్లో చదివే విద్యార్థులను సమీప పాఠశాలల్లో చేర్పిస్తున్నామని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, పాకిస్తాన్ మొత్తం జనాభా (22 కోట్లు)లో 2శాతం మంది హిందువులు ఉన్నారు.


ఇటీవల సింధ్ ప్రావిన్స్‌లో హిందూ దేవాలయాన్ని టార్గెట్ చేసి విధ్వంసానికి పాల్పడ్డారు. ఖైర్‌పూర్‌ జిల్లా కుంబ్‌లోని శ్యామ్‌సేవా దేవాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆలయంలోకి వెళ్లి కృష్ణుడు, ఇతర విగ్రహాలకు నిప్పుపెట్టారు. ఆలయ విధ్వంసాన్ని నిరసిస్తూ సింధ్ ప్రావిన్స్‌లో పలు హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. హిందూ దేవాలయాలకు రక్షణ కల్పించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
First published: February 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...