Imarn Khan : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI)పార్టీ చీఫ్,మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) కు బిగ్ షాక్ తగిలింది. ఇకపై ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలను శాటిలైట్ ఛానెల్ లలో ప్రత్యక్ష ప్రసారం చేయకుండా పాకిస్తాన్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ(PEMRA)నిషేధం విధించింది. కేవలం ఇమ్రాన్ యొక్క రికార్డ్ చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేయడానికి అనుమతించింది. అన్ని శాటిలైట్ టీవీ ఛానెల్ లలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంపై నిషేధం తక్షణమే అమలులోకి వస్తుందని PEMRA తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఇమ్రాన్ ఖాన్ కి అత్యంత దగ్గరి వ్యక్తి అయిన షాబాజ్ గిల్ ఈ నెల ప్రారంభంలో ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ..పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. టెలివిజన్‌లో పాకిస్తాన్ సైన్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత గిల్‌ను ఆగస్టు 9న పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యతిరేక ప్రచారంలో ప్రైవేట్ టీవీ న్యూస్ ఛానెల్‌తో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై ఇమ్రాన్ సన్నిహితుడిని అరెస్టు చేశారు. పోలీసు కస్టడీలో "భయంకరమైన హింసకు" గురయ్యాడని పీటీఐ పార్టీ పేర్కొంది. షాబాజ్ గిల్‌ను తీవ్రంగా హింసించారని,అతడిని హింసించినందుకు ఇస్లామాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్, మహిళా మేజిస్ట్రేట్‌లను వదిలిపెట్టనని,వారిపై కేసులు నమోదు చేస్తానని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణం చేసిన కొన్ని గంటల తర్వాత ఇమ్రాన్ ప్రసంగాలను టీవీ ఛానెల్ లో ప్రసారం చేయకుండా PEMRA నిషేధం విధించింది.
Drugs Test To PM : విపక్షాల విమర్శలతో ప్రధానికి డ్రగ్స్ టెస్ట్!
ఇస్లామాబాద్‌లోని ఎఫ్-9 పార్క్‌లో జరిగిన బహిరంగ సభలో ఇమ్రాన్ మాట్లాడుతూ..మేము ఐజి, డిఐజిలను విడిచిపెట్టం.అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి జెబా చౌదరి... గత వారం రాజధాని పోలీసుల అభ్యర్థన మేరకు గిల్ యొక్క రెండు రోజుల భౌతిక రిమాండ్‌ను ఆమోదించారు.ఆమెపై కూడా కేసు నమోదు చేయబడుతుంది కాబట్టి ఆమె కూడా సిద్ధంగా ఉండాలని అన్నారు. జైలులో ఉన్న నాయకుడు షాబాజ్ గిల్‌కు మద్దతుగా PTI ఇస్లామాబాద్‌లో ర్యాలీని నిర్వహించింది. గిల్‌ను హింసించడం ద్వారా తమని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆయన అన్నారు, ఇది దేశ ప్రజలకు "నిర్ణయాత్మక క్షణం" అని ఇమ్రాన్ అన్నారు. ప్రభుత్వంలోని సంకీర్ణ నాయకులు "సైన్యానికి నిజంగా నష్టం కలిగించడానికి దానికంటే చాలా ఎక్కువ చెప్పారు" అని గిల్ ని ఇమ్రాన్ ఖాన్ సమర్థించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Imran khan, Pakistan