మోదీ దెబ్బకు దిగివచ్చిన ఇమ్రాన్ ప్రభుత్వం...ముగ్గురు జైషే ఉగ్రవాదులకు జైలుశిక్ష...

పారిస్ కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాద ఆర్థిక నిఘా సంస్థ ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్ ను గ్రే లిస్టులో ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థలను అరికట్టడంలో పాకిస్థాన్ ప్రభుత్వం వైఫల్యం చెందిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఎటీఎఫ్ సంస్థ తెలిపింది. దీంతో పాకిస్థాన్ కు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహకారానికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది.

news18-telugu
Updated: June 1, 2019, 4:46 PM IST
మోదీ దెబ్బకు దిగివచ్చిన ఇమ్రాన్ ప్రభుత్వం...ముగ్గురు జైషే ఉగ్రవాదులకు జైలుశిక్ష...
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ చిత్రం)
  • Share this:
భారత్ లో పలు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ కు చెందిన ముగ్గురు కీలక నేతలకు 5 సంవత్సరాల శిక్ష విధిస్తూ పాకిస్థాన్ న్యాయస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా యాంటీ టెర్రరిజం కోర్టు తీసుకున్న ఈ తీర్పులో నిందితులు ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధుల సేకరణ చేపడుతున్నారని, అందుకే వీరికి శిక్ష విధించినట్లు తెలిపింది. జైషే తీవ్రవాదును పంజాబ్ ప్రావిన్స్ లోని గుజ్రాన్ వాలా కారాగారానికి పంపింది. ఇదిలా ఉంటే పాకిస్థాన్ కు చెందిన కౌంటర్ టెర్రరిజం విభాగం, వరుసగా ఉగ్రవాద శిబిరాల ఆర్థిక మూలాలపై దాడులను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పాకిస్తాన్ లోని పలు రాష్ట్రాల్లోని ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడం, వారి బ్యాంకు అకౌంట్లను సీజ్ చేయడం జరుగుతోంది. అలాగే పంజాబ్ ప్రావిన్స్ లోని ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరులను సైతం గురువారం అరెస్టు చేశారు. అలాగే మసూద్ అజహర్ కు చెందిన ముఖ్య అనుచరులను కూడా పాకిస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పాకిస్థాన్ లోని పలువురు పారిశ్రామిక వేత్తలు, ఉన్నత కుటుంబాను టార్గెట్ చేసుకొని వారి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న మరో ఆరుగురిని సైతం అరెస్టు చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే పారిస్ కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాద ఆర్థిక నిఘా సంస్థ ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్ ను గ్రే లిస్టులో ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థలను అరికట్టడంలో పాకిస్థాన్ ప్రభుత్వం వైఫల్యం చెందిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్ఎటీఎఫ్ సంస్థ తెలిపింది. దీంతో పాకిస్థాన్ కు అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సహకారానికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. కాగా ఇప్పటికే జైషే మహ్మద్, లష్కరే తోయిబా, ఇస్లామిక్ స్టేట్ కు చెందిన సానుభూతి పరులను ఇప్పటికే 100 మంది వరకూ అరెస్టు చేసింది. వారిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కుమారుడుతో పాటు సోదరుడు కూడా ఉండటం గమనార్హం. అలాగే పలు మసీదులు, సెమినార్లపై పాకిస్థాన్ పోలీసులు నిఘాలో నడుస్తున్నాయి.

కాగా, మోదీ ప్రభుత్వం దేశంలో వరుసగా రెండో సారి అధికారంలో చేపట్టడంతో పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ప్రభుత్వం ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అంతర్జాతీయ సమాజంలో పాకిస్థాన్ ను ఒంటరి చేయడమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే పాకిస్థాన్ కు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం పొందడం తప్పనిసరి పరిస్థితి. దీంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులకు చెక్ పెట్టేందుకు ఇమ్రాన్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

First published: June 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>