Pak Airstrikes On Afghanistan : తాలిబన్లు గతేడాది అప్ఘానిస్తాన్(Afghanistan) ను చేజిక్కించుకున్నప్పటి నుంచి పాకిస్తాన్-అప్ఘానిస్తాన్ దేశాల మధ్య సరిహద్దు గొడవలు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా అప్ఘానిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది. డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న అప్ఘానిస్తాన్ లోని ఖోస్ట్, కునార్ ప్రావిన్సుల్లోని వివిధ ప్రాంతాలపై శుక్రవారం రాత్రి పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపింది. దాదాపు 26 పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్ట్‌లు జరిపిన ఈ దాడుల్లో 40 మందికిపైగా అఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఖోస్త్, కునర్ ప్రావిన్సుల్లోని భిన్న ప్రాంతాల్లో పాకిస్తానీ విమానాలు దాడులు(Pak Air Strikes On Afghanistan) చేసినట్లు స్థానిక అధికారులు కూడా శనివారం ధ్రువీకరించారు. అప్ఘాన్ లో తాలిబన్లు అధికారం చేపట్టాక పాకిస్తాన్ దాడులు చేపట్టడం ఇదే తొలిసారి అని స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడులను ఖండిస్తున్నట్లు తాలిబన్లు(Taliban) ప్రకటించారు. ఘటనపై వివరణ ఇవ్వాల్సిందిగా పాక్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్కు సమన్లు జారీ చేశాం అని అప్ఘాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అప్ఘానిస్తాన్ విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం.. పాకిస్తానీ బలగాల వైమానిక దాడులపై పాకిస్తాన్ రాయబారి ఎదుట అఫ్గాన్ తాత్కాలిక డిప్యూటీ రక్షణ మంత్రి అల్హాజ్ ముల్లా శిరిన్ అఖుంద్ నిరసన తెలియజేశారు. విదేశాంగ కార్యాలయానికి పాకిస్తానీ రాయబారిని పిలిపించారు... ఆయన ఎదుట అఖుంద్ తోపాటు విదేశాంగ మంత్రి మవ్లావీ ఆమిర్ ఖాన్ కూడా నిరసన వ్యక్తంచేశారు అని అఫ్గాన్ విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. తాజా దాడుల ద్వారా అఫ్గాన్ సార్వభౌమత్వాన్ని పాకిస్తాన్ ఉల్లంఘించిందని విదేశాంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా గోర్బ్‌జ్ జిల్లాలో శుక్రవారం 9 గంటల సమయంలో పాకిస్తాన్ బలగాలకు, తాలిబన్లకు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో ఇద్దరు తాలిబన్ మిలిటెంట్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ALSO READ UK PM : ఎన్నాళ్లకెన్నాళ్లకు..భారత పర్యటనకు బోరిస్ జాన్సన్..నేరుగా గుజరాత్ కే
కాగా, తీవ్రవాదులకు తాలిబాన్లు ఆశ్రయం ఇవ్వడాన్ని పాకిస్తాన్ తీవ్రంగా తప్పుబడుతోంది. ఈ నేపథ్యంలో వజీరిస్తాన్ నుంచి వలస వచ్చిన వారి శిబిరాలే లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం దాడులకు పాల్పడింది. పాకి్ భూభాగంలోకి వచ్చే ఉత్తర వజీరిస్తాన్‌లోని ప్రభుత్వ వ్యతిరేక ఉగ్రవాదులను వైమానిక దాడులతో మట్టుబెట్టినట్లు పాకిస్తా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పాకికిస్తాన్-అప్ఘానిస్తాన్ దేశాల మధ్య 2,700 కిలోమీటర్ల డ్యూరాండ్ లైన్ అని పిలిచే సరిహద్దు ఉంది. దీనిని ఆక్రమించుకునేందుకు తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Afghanistan, Pakistan, Pakistan army, Taliban