గగన తలాన్ని మూసివేసిన పాకిస్థాన్... విమానాల రాకపోకలకు బ్రేక్

మార్చి 11 అంటే సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.

news18-telugu
Updated: March 10, 2019, 8:25 AM IST
గగన తలాన్ని మూసివేసిన పాకిస్థాన్... విమానాల రాకపోకలకు బ్రేక్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: March 10, 2019, 8:25 AM IST
భారత వైమానిక దాడి తర్వాత పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం మధ్యాహ్నం మూడుగంటల వరకు తమ గగన తలాన్ని మూసివేస్తున్నట్లు పాక్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు పాక్ సివిల్ ఏవియేషన్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ ట్రాన్సిట్ విమానాలు తమ భూభాగంలో ప్రవేశించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అయితే ఉత్తర, దక్షిణ మార్గాల ద్వారా ముందుగా నిర్ణయించిన విమానాలకు మాత్రం అనుమతి ఉన్నట్లు తెలిపింది.

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా గత నెల 26న భారత్ నిర్వహించిన వైమానిక దాడి తర్వాత పాక్ తమ గగన తలాన్ని మూసివేసింది. దీంతో ఆసియా, ఐరోపా ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు వేలాదిమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుడు మూసేసిన తమ గగన తలాన్ని ఈ 9న తిరిగి తెరవనున్నట్టు ప్రకటించింది. అయితే, అంతలోనే మరో ప్రకటన చేసింది. మార్చి 11 అంటే సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది.

పూల్వామా ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్, భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈనేపథ్యంలోనే గతనెల 26న పాక్‌పై భారత్ వైమానిక దాడులకు ప్రయత్నించింది. ఈ దాడితో పాకిస్థాన్‌ వణికింది. ఇక అప్పట్నుంచి అన్ని ఎయిర్‌పోర్టులను మూసివేసింది. అనంతరం పాక్ గగనతలాన్ని కూడా మూసివేసింది.

First published: March 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...