ఇది విన్నారా... ప్రయాణికులు లేకుండానే తిరిగిన 46 విమానాలు

Pakistan Airline : అసలే పాకిస్థాన్ పరిస్థితి అస్సలు బాలేదు. అలాంటి దేశంలో 46 విమానాలు ఉత్తినే, ప్రయాణికులు లేకుండా తిరగడమంటే మామూలు విషయమా? ఎందుకిలా జరిగిందో తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 22, 2019, 9:01 AM IST
ఇది విన్నారా... ప్రయాణికులు లేకుండానే తిరిగిన 46 విమానాలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
2016-17లో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA)... 46 విమానాల్ని ఇస్లామాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచీ ప్రయాణికులు లేకుండా నడిపింది. అసలే ఆ ఎయిర్‌లైన్స్ రూ.1,280 కోట్ల నష్టాల్లో ఉంది. అలాంటప్పుడు... వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికుల్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలి. అది మానేసి... అసలు ప్రయాణికులే లేకుండా విమానాల్ని నడపాల్సిన అవసరం ఏముంది? ఈ అంశంపై మేనేజ్‌మెంట్... ప్రభుత్వానికి చెప్పింది కూడా. ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దానికి తోడు... హజ్‌కి వెళ్లే యాత్రికులు కూడా బాగా తగ్గిపోయారు. 36 విమానాలు సరిపడా యాత్రికులు లేకుండానే హజ్ టూర్లు నడిపాయి. అంటే లాస్‌లో టూర్లు వేశాయన్నమాట.

ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి బాలేదు. ఆర్థికంగా పతనమై ఉంది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) అనే యాంటీ మనీ లాండరింగ్ వాచ్ డాగ్ సంస్థ ఉంటుంది. అది పతనమయ్యే ఆర్థిక వ్యవస్థల్ని బ్లాక్ లిస్టులో పెడుతుంది. పాకిస్థాన్‌ను కూడా ఆ లిస్టులో చేర్చాలని అనుకుంటుంది. అదే జరిగితే... పాకిస్థాన్‌కి మరిన్ని ఆర్థిక సమస్యలు తప్పవు. అదీ ప్రజెంట్ ఆ దేశం పొజిషన్.

ఎకానమీ పడిపోతున్న సమయంలో... పాకిస్థాన్‌ను ఆదుకోవడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చాలా డబ్బులు ఇస్తోంది. అవన్నీ హారతి కర్పూరం అవుతున్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ... వాళ్లకే వంతపాడుతూ ప్రపంచ దేశాలతో తిట్లు తింటోంది. ఉగ్రవాదులు, ISI ఏకమై... పాకిస్థాన్ సైన్యాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్... మెతక మనిషి. అందువల్ల ఆయన... పూర్తిగా ఉగ్రవాదులకు లొంగిపోతున్నారన్న విమర్శలు మూటకట్టుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ వృథాగా విమానాలు నడుపుతున్నట్లు తాజాగా బయటపడింది.
Published by: Krishna Kumar N
First published: September 22, 2019, 9:01 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading