భారత్-పాక్ దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఏ క్షణాన ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళనను పెంచుతున్నాయి. కశ్మీర్‌లోని పుల్వామా దాడి తర్వాత భారత్ పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ పాక్‌పై ప్రతీకార దాడికి దిగుతుందా? లేక అంతర్జాతీయ సమాజం ముందుకొచ్చి చర్చలతో దీనికి పరిష్కారం చూపిస్తుందా? అన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యూఏఈలో శుక్రవారం నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో పర్వేజ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని కరాచీ కేంద్రంగా పనిచేసే ఓ వార్తా పత్రిక ఈ కథనాన్ని ప్రచురించింది.కశ్మీర్ దాడికి పాకిస్తానే దోషి అని భారత్ భావిస్తున్నవేళ.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ మాత్రం ఇలాంటివి తమపై రుద్దడం సరికాదని స్పందించిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడితో పాకిస్తాన్‌కు సంబంధం లేదని, తాము ఉగ్రవాదులను పోషించట్లేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పుడు పర్వేజ్ కూడా పుల్వామా దాడిని ఖండించకపోగా.. భారత్ ఎదురుదాడికి దిగకముందే పాక్ మరో దాడికి పాల్పడాలని సలహాలిస్తున్నారు. మొత్తం మీద భారత్ పట్ల పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి మరోసారి తేట తెల్లం అవుతోందన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిని రేపుతోంది.
ఇవి కూడా చదవండి :
అరుణాచల్‌లో ఆ సర్టిఫికెట్ చిచ్చు : రగులుతోన్న అశాంతి.. డిప్యూటీ సీఎం బంగ్లాకు నిప్పుపుల్వామా ఉగ్రదాడి.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jammu and Kashmir, Kashmir security, Pulwama Terror Attack