హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pakistan: గతంలో ఇమ్రాన్ ఖాన్ తొలగించిన వ్యక్తికి ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ బాధ్యతలు

Pakistan: గతంలో ఇమ్రాన్ ఖాన్ తొలగించిన వ్యక్తికి ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్ బాధ్యతలు

అసిమ్ మునీర్

అసిమ్ మునీర్

Pakistan: 2018 అక్టోబర్‌లో ISI చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎనిమిది నెలల్లోనే ఆయన్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తప్పించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

పాకిస్తాన్‌కు కొత్త ఆర్మీ చీఫ్ (Pakistan Army Chief) రాబోతున్నారు. లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మునీర్ (Asim Munir) పాకిస్తాన్ 17వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజ్వా (Qamar Javed Bajwa) నవంబర్ 29న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు అసిమ్ మునీర్. ఈ మేరకు పాకిస్తాన్ సమాచార, ప్రసార శాఖ మంత్రి మర్యమ్ ఔరంగజేబ్ ప్రకటన విడుదల చేశారు. లెఫ్టినెంట్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జాను జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌గా, లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్‌ను ఆర్మీ చీఫ్‌గా నియమించాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు.

త్వరలో ఖమర్ జావెద్ బజ్వా పదవీ వీరమణ చేయనున్న నేపథ్యంలో.. పాక్ ఆర్మీ పదవి రేసులో మునీర్ ఉన్నాని ముందు నుంచీ వినిపిస్తోంది. జనరల్ బజ్వా పదవీ విరమణ నవంబరు 29న జరుగుతుండగా... అందుకు రెండు రోజుల ముందు, లెఫ్టినెంట్ జనరల్‌గా మునీర్ నాలుగేళ్ల పదవీకాలం నవంబర్ 27న ముగియనుంది. ఐతే ఆయన రిటైర్మెంట్‌కు ముందే ఆర్మీ చీఫ్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసిమ్ మునీర్ సర్వీసును మరో మూడేళ్ల పాటు పొడిగించనున్నట్లు తెలుస్తోంది.

లెఫ్టినెంట్ జనరల్ మునీర్ ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్‌లో పనిచేశారు. జనరల్ బజ్వా ఆధ్వర్యంలో బ్రిగేడియర్‌గా దళానికి నాయకత్వం వహించినప్పటి నుంచి అవుట్‌గోయింగ్ COASకి సన్నిహిత సహాయకుడిగా ఉన్నాKI. ఆ సమయంలో జనరల్ బజ్వా ఎక్స్ కార్ప్స్ కమాండర్‌గా ఉన్నారు. ఇక 2017 ప్రారంభంలో మునీర్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2018 అక్టోబర్‌లో ISI చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అప్పటి ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఎనిమిది నెలల్లోనే ఆయన్ను ఐఎస్ఐ చీఫ్ పదవి నుంచి తప్పించారు. తనకు అత్యంత సన్నిహితుడైన లెఫ్టినెంట్-జనరల్ ఫైజ్ హమీద్‌ను కొత్త చీఫ్‌గా నియమించారు. ఐతే ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌.. మునీర్‌కు ఆర్మీ చీఫ్ బాధ్యతలను అప్పజెప్పారు.

First published:

Tags: International, International news, Pakistan, Pakistan army

ఉత్తమ కథలు