PAINLESS DEATH IN ONE MINUTE SWITZERLAND LEGALIZE SUICIDE MACHINE FOR EUTHANASIA FULL DETAILS HERE MKS
నొప్పి లేకుండా చనిపోయే suicide machine.. చట్టబద్ధంగా నచ్చిన చోట నిమిషంలో ప్రాణం వదలొచ్చు..
స్విట్జర్లాండ్ ఆత్మహత్య యంత్రం
సార్కో అనే పేరు గల ఈ 'సూసైడ్ మెషీన్'.. హైపోక్సియా, హైపోకాప్నియా (కణజాల స్థాయిలో ఆక్సిజన్ సరఫరా తగ్గడం, మరణానికి దారితీసే రక్తంలో కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడం) ద్వారా నొప్పిలేకుండా మనుషులను చంపుతుంది. ఈ ఆత్మహత్య యంత్రంలోకి వెళ్లిన వ్యక్తి గ్లాస్ క్యాప్సూల్ లోపల ఆక్సిజన్ స్థాయిని కేవలం రెప్పపాటు కదలికలతో క్లిష్టమైన స్థాయికి తీసుకురాగలరు.
సార్కో అనే పేరు గల ఈ 'సూసైడ్ మెషీన్'.. హైపోక్సియా, హైపోకాప్నియా (కణజాల స్థాయిలో ఆక్సిజన్ సరఫరా తగ్గడం, మరణానికి దారితీసే రక్తంలో కార్బన్ డయాక్సైడ్ను తగ్గించడం) ద్వారా నొప్పిలేకుండా మనుషులను చంపుతుంది. ఈ ఆత్మహత్య యంత్రంలోకి వెళ్లిన వ్యక్తి గ్లాస్ క్యాప్సూల్ లోపల ఆక్సిజన్ స్థాయిని కేవలం రెప్పపాటు కదలికలతో క్లిష్టమైన స్థాయికి తీసుకురాగలరు. పక్షవాతం వల్ల కనురెప్పలు తప్ప మిగతా శరీర భాగాలేవీ కదిలించే లేని వ్యక్తులు కూడా ఇందులోకి వెళ్లి నిమిష వ్యవధిలో నొప్పిలేకుండా తమ ప్రాణాన్ని పోగొట్టుకోవచ్చు. యంత్రాన్ని ఉపయోగించే వ్యక్తి లాక్-ఇన్ సిండ్రోమ్‌తో బాధపడుతుంటే.. ఆ వ్యక్తి దీనిని రెప్పవేయడం ద్వారా కూడా లోపల నుంచి ఆపరేట్ చేయవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
ప్రాణాలను నిమిషంలోనే తీయగల ఈ యంత్రాన్ని వినియోగదారులు నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు. ఇది శవపేటిక వలె పనిచేయడానికి బయోడిగ్రేడబుల్ క్యాప్సూల్ బేస్ నుంచి విడిపోతుంది. రోగాల బాధ కంటే చావే శరణ్యం అనుకునేవారు స్విట్జర్లాండ్‌లో చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అసిస్టెడ్-డైయింగ్ కోసం డాక్టర్లను ఒప్పించి లిక్విడ్ సోడియం పెంటోబార్బిటల్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సూసైడ్ మెషీన్ తో ఎలాంటి సూదులు పొడిపించుకోకుండానే ప్రాణాలను శాంతంగా వదిలేయవచ్చు.
నయం చేయలేని జబ్బులతో తీవ్రమైన బాధతో ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్న వారిని చట్టపరంగా చంపడాన్ని కారుణ్య మరణం లేదా యూథనేజియా/యూథనేష్యా (euthanasia) అని అంటారు. బాధ నివారణకు అమలు చేసే ఈ మెర్సీ కిల్లింగ్ (mercy killing) చాలా దేశాల్లో చట్టవిరుద్ధం. అయితే స్విట్జర్లాండ్ మాత్రం ఇందుకు వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంది. ఒక నిమిషం కాలంలో నొప్పి లేకుండా మనుషులను చంపే ఓ యంత్రాన్ని తాజాగా స్విట్జర్లాండ్ చట్టబద్ధం చేసింది. శవపేటిక-ఆకారంలో ఉండే ఈ క్యాప్సూల్ ఒక నిమిషంలోనే నొప్పిలేకుండా, ప్రశాంతమైన మరణాన్ని అందిస్తుంది. దీన్ని స్విట్జర్లాండ్ చట్టబద్ధం చేసిందని దాని తయారీదారులు తెలిపారు.
‘డాక్టర్ డెత్’ అని పిలిచే డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే ఈ ఆత్మహత్య యంత్రాన్ని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. నిట్ష్కే ఎగ్జిట్ ఇంటర్నేషనల్ అనే నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కు డైరెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో సహాయక ఆత్మహత్య చట్టబద్ధం కాగా గత సంవత్సరంలో సుమారు 1,300 మంది మెర్సీ కిల్లింగ్ సంస్థల సేవలను ఉపయోగించారు.
“ఇలాంటి ఇబ్బందులు ఎదురు కాకపోతే.. వచ్చే ఏడాది స్విట్జర్లాండ్‌లో సార్కోను అందుబాటులోకి తీసుకురావడానికి మేం సిద్ధంగా ఉన్నామని ఆశిస్తున్నాం. ఇది ఇప్పటివరకు చాలా ఖరీదైన ప్రాజెక్ట్, కానీ మేం ఇప్పుడు అమలుకు చాలా దగ్గరగా ఉన్నామని మేం భావిస్తున్నాం" అని డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే చెప్పారు.
అయితే ఇలాంటి పరికరాల వినియోగం పై పలువురు నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. నిట్ష్కే సజీవ సమాధి చేసే యంత్రంలో ఉపయోగించిన పద్ధతిని కొందరు తప్పు పడుతున్నారు. దీనిని గ్లోరిఫైడ్ గ్యాస్ చాంబర్ అని, సూసైడ్ ని గ్లామరైజ్ చేసే యంత్రం అని కొందరు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం, కేవలం రెండు సార్కో ప్రోటోటైప్‌లు మాత్రమే ఉన్నాయి. ఎగ్జిట్ ఇంటర్నేషనల్ మూడవ మెషీన్‌ను 3డి ప్రింటింగ్ చేస్తోంది. ఇది వచ్చే ఏడాది స్విట్జర్లాండ్‌లో ఆపరేషన్‌కు సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.