World Ozone Day: అదే జరిగితే ఓజోన్ పోరును రక్షించలేం.. వీటిని తగ్గించుకుంటేనే మేలు..

ప్రతీకాత్మక చిత్రం

కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ తదితర కారణాల వల్ల ఓజోన్ పొరకు చిల్లులు పడుతుండటం ఆందోళనకు దారితీస్తుంది.

  • Share this:
ఓజోన్ పొర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్యుడి నుంచి విడుదలయ్యే ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి భూమిపై నివసించే సమస్త జీవరాశులను ఈ పొర రక్షిస్తుంది. అయితే కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్ తదితర కారణాల వల్ల ఓజోన్ పొరకు చిల్లులు పడుతుండటం ఆందోళనకు దారితీస్తుంది. ఫలితంగా 1994లో ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 16ను ప్రపంచ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం లేదా ‘వరల్డ్ ఓజోన్ డే’ గా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ రోజున ఏటా ఓజోన్ పరిరక్షణ ప్రాధాన్యం గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

* భూమిపై జీవరాశులను రక్షించే కవచం..
సూర్యుడి నుంచి వచ్చే కాంతి భూమిపై జీవుల మనుగడకు కారణమవుతుంది. అయితే ఈ కాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు ప్రమాదకరమైనవి. ఇవి భూమిని చేరకుండా ఓజోన్ పొర అడ్డుకుంటుంది. ఇది లేకపోతే జీవుల మనుగడ సాధ్యం కాదు. 1970వ దశకం చివర్లో ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పొరను దెబ్బతీసే వాయువుల వల్ల దీనికి రంధ్రాలు ఏర్పడుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనింగ్ తో పాటు ఇతర కూలింగ్ టెక్నాలజీ డివైజ్‌ల నుంచి ఈ వాయువులు విడుదలవుతున్నాయి.

ఓజోన్ పొరను కాపాడటానికి 1985లో వియన్నా ఒప్పందంపై ప్రపంచ దేశాలు సంతకం చేశాయి. ఓజోన్ ప్రాముఖ్యత గురించి దశాబ్దాలుగా అవగాహన ఉన్నప్పటికీ దాన్ని కాపాడాల్సిన అవసరం గతంలో కంటే ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. ఎందుకంటే భూమిపై జీవుల మనుగడకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి.

దురదృష్టవశాత్తు క్రితం శతాబ్దంలో మానవులు చేపట్టిన వేగవంతమైన పారిశ్రామికీకరణ.. అస్తవ్యస్త వాతావరణ పరిస్థితులకు కారణమైంది. అడవుల్లో కార్చిచ్చు, అకాల వరదలు ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని విధంగా ఇబ్బందులకు గురిచేశాయి. అయితే వియన్నా ఒప్పందంలోని మాంట్రియల్ ప్రోటోకాల్ వల్ల అనుకూల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

ఈ శతాబ్దం మధ్య నాటికి ఓజోన్ పొర పూర్వ వైభవానికి(1980కి ముందు) చేరుతుందని నిపుణులు అంచనావేస్తున్నారు. గ్రీన్ హౌస్ వాయువులు, మిథైల్ బ్రోమైడ్, మిథైల్ క్లోరోఫామ్, కార్బన్ టెట్రా క్లోరైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్(CFC), హైడ్రో ఫ్లోరో కార్బన్స్(HFC) లాంటి రసాయన వాయువులు ఓజోన్ పొర క్షీణతకు కారణమవుతున్నాయి.

Telangana BJP: కేంద్రమంత్రిపై తెలంగాణ బీజేపీ అసహనం.. ఇలా చేస్తే ఎలా అంటూ..

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్.. సైలెంట్ అయిన సీనియర్ నేత.. కాంగ్రెస్‌లో చర్చ

* ప్రస్తుతం ఓజోన్ పొర సురక్షితంగా ఉందా?
మాంట్రియల్ ప్రోటోకాల్ పూర్తి స్థాయి సంక్షోభాన్ని నివారించినప్పటికీ అడవుల ప్రమాదం నుంచి మనం ఇంకా బయటపడలేదు. ఈ ఏడాది లాంకాస్టర్ వర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనం నేచర్ అనే జర్నల్లో ప్రచురితమైంది. ఓజోన్ పొరను రక్షించనట్లయితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వివరించారు. ఈ శతాబ్దం చివరినాటికి 0.5 డిగ్రీల నుంచి 1 డిగ్రీల సెంటిగ్రేడ్ కు ఉష్ణోగ్రత పెరిగితే ఓజోన్ పొరను రక్షించలేమని, ఫలితంగా వాతావరణ మార్పులతో భూమిపై జీవనం తుడిచిపెట్టడానికి కారణమవుతుందని పేర్కొన్నారు.

* ఓజోన్ పొరను ఎలా రక్షించాలి?
క్షీణతకు కారణమయ్యే క్లోరోఫ్లోరో కార్బన్స్ లాంటి వాయువులను ఉత్పత్తి చేసే ప్రొడక్టులను వినియోగించకూడదు. ఎయిర్ కండిషనర్లు లాంటి ఉపకరణాలను జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వాతావరణంలోకి క్లోరోఫ్లోరో కార్బన్స్ లీకేజీని నివారించవచ్చు. వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించి ప్రజారవాణాపై ఆధారపడితే కొంతమేరకు పరిస్థితిని అదుపు చేయవచ్చు. వాతావరణ మార్పును మానవాళి నిలువరించాలంటే ఓజోన్ పొరను రక్షించడం ఎంతో ముఖ్యం.]
Published by:Kishore Akkaladevi
First published: