లైంగిక సామర్థ్యం పెరుగుతుందని వీటిని తెగ తినేస్తున్నారట...?

నత్త మాంసంలో డీ అస్పరిటిక్ యాసిడ్ లభ్యమయ్యిందని, ఈ మూలకాన్ని ఎలుకలపై ప్రయోగించగా, వాటిలో లైంగిక సామర్థ్యం పెరిగిందని పరిశోధనలు వెలువడ్డాయి. ఇదే అదనుగా తీసుకొని యూత్ నత్త మాంసం తినడమే పనిగా పెట్టుకున్నారు.

news18-telugu
Updated: June 19, 2019, 8:41 PM IST
లైంగిక సామర్థ్యం పెరుగుతుందని వీటిని తెగ తినేస్తున్నారట...?
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: June 19, 2019, 8:41 PM IST
పడక గదిలో రెచ్చిపోయేందుకు బ్రిటన్ యువత వయాగ్రా లాంటి మందులు వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదట. అయితే నేచురల్ గా వయాగ్రా స్థాయిలో లైంగిక ఉత్ప్రేరకాల కోసం బ్రిటన్ యువత తెగ వెతుకుతున్నారట. అయితే చాలా మంది డైటీషియన్లు నత్తలను తింటే లైంగిక సామర్థ్యం బాగా పెరుగుతుందని చెప్పడంతో ఒక్కసారిగా, బ్రిటన్ యువత వీటిని గుటుక్కు మనిపించడమే పనిగా పెట్టుకున్నారట. సాధారణంగా నత్త మాంసం సరదాగా అప్పుడప్పుడు తింటుంటారు. అయితే లైంగిక సామర్థ్యం పెంచుతుందనే వార్తలతో ఒక్కసారిగా వీటి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో వీటిని దిగుమతి చేసుకొని మరీ తినేస్తున్నారట. ముఖ్యంగా నత్త మాంసంలో డీ అస్పరిటిక్ యాసిడ్ లభ్యమయ్యిందని, ఈ మూలకాన్ని ఎలుకలపై ప్రయోగించగా, వాటిలో లైంగిక సామర్థ్యం పెరిగిందని పరిశోధనలు వెలువడ్డాయి. ఇదే అదనుగా తీసుకొని యూత్ నత్త మాంసం తినడమే పనిగా పెట్టుకున్నారు. అయితే ముఖ్యంగా "బై వాల్వ్ మొలాకస్" రకం నత్తల్లో ఈ శృంగార ఉత్ప్రేరకం అధికంగా ఉందని పరిశోధకులు తేల్చారు. అలాగే నత్తల్లో జింక్ అత్యధిక శాతం ఉంటుంది. తద్వారా స్పెర్మ్ సంఖ్యతో పాటు, టెస్టోస్టిరాన్ మోతాదును పెంచడంలో జింక్ ఉపయోగపడుతుందని పరిశోధకులు తేల్చారు. అంతే కాదు ప్రతి రోజు నత్త మాంసం తీసుకుంటే పొట్ట కూడ తగ్గే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది.

ఇంకేముంది, అసలే బిజీ లైఫ్‌లో శృంగార జీవితానికి దూరమై వయాగ్రాను నమ్ముకున్న బ్రిటన్ యువతకు, నత్త మాంసం సంజీవనిలా లభించినట్లయ్యింది. వీటి కోసం ఎంత ధర అయినా వెచ్చించేందుకు వెనుకాడ్డం లేదు. ముఖ్యంగా మొలాకస్ రకం నత్తలను మాత్రం బంగారం కంటే ఎక్కువ విలువ పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నారట.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...