రీల్ హీరో.. రియల్ విలన్.. ఆడపిల్లను వద్దనుకుంటున్న నటుడు..

ప్రముఖ హాలీవుడ్ హీరో ఒవెన్ విల్సన్ ఆడపిల్లనే వద్దనుకుంటున్నాడు. ఇతగాడు గతకొంతకాలంగా వరుణీ వోంగ్స్ వైరేట్స్ అనే యువతితో డేటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే వరుణీ ఆడపిల్లకు జన్మనిచ్చింది.

news18-telugu
Updated: November 10, 2018, 4:47 PM IST
రీల్ హీరో.. రియల్ విలన్.. ఆడపిల్లను వద్దనుకుంటున్న నటుడు..
హాలీవుడ్ హీరో ఓవెన్ విల్సన్
news18-telugu
Updated: November 10, 2018, 4:47 PM IST
లింగవివక్షను తగ్గించాలని ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆడపిల్లను కాపాడండి.. ఆడపిల్ల మీ ఇంటి మహాలక్ష్మీ అంటూ వారికోసం ఎన్నోకొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నాయి. ఈ విషయంలో కొంతమార్పు వచ్చినప్పటికీ పరిస్థితులు పూర్తిగా మారలేదు.
తాజాగా.. జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహారణగా నిలిచింది. ప్రముఖ హాలీవుడ్ హీరో ఒవెన్ విల్సన్ ఆడపిల్లనే వద్దనుకుంటున్నాడు. ఇతగాడు గతకొంతకాలంగా వరుణీ వోంగ్స్ వైరేట్స్ అనే యువతితో డేటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే వరుణీ ఆడపిల్లకు జన్మనిచ్చింది.
అయితే, దాదాపు ఐదేళ్ళ పాటు వరుణీతో డేటింగ్‌లో మునిగితేలిన ఒవెన్.. ఆమె నెలతప్పింది అని తెలిసినప్పట్నుంచీ తనదగ్గరికి వెళ్లలేదట.. అంతేకాదు.. వరుణీ, ఆమె కూతురుకి సంబంధించిన ఎలాంటి విషయాల్లో తాను జోక్యం చేసుకోనని పిటీషన్‌లో పేర్కొన్నాడట. వరుణీ కంటే ముందే ఇద్దరు భార్యల నుంచి ఇద్దరు కుమారులున్నారు. వారే తన సంతానమని.. ఆడపిల్లని పెంచుకునేందుకు తాను ఇష్టపడట్లేదని హాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది..

దీంతో.. సోషల్ మీడియాలో ఒవెన్ విల్సన్‌కి వ్యతిరేకంగా ఓ యుద్ధమే నడుస్తోంది.. చాలామంది ఒవెన్ విమర్శిస్తూ.. రీల్ లైఫ్‌లో కాదు.. రియల్ లైఫ్‌లో హీరోగా ఉండమంటూ సలహాలిచ్చేస్తున్నారు.

First published: November 10, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...