Home /News /international /

OVER 30 DEAD AND 100 INJURED AS ROCKETS STRIKE TRAIN STATION IN EAST UKRAINE PVN

Russia-Ukraine War : ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై రష్యా రాకెట్ దాడులు..భారీగా సామాన్య పౌరులు మృతి

ఉక్రెయిన్ పై రష్యా రాకెట్ దాడులు(ప్రతీకాత్మక చిత్రం)

ఉక్రెయిన్ పై రష్యా రాకెట్ దాడులు(ప్రతీకాత్మక చిత్రం)

Rockets Strike Train Station In East Ukraine : ఈ ఏడాది పిబ్రవరి చివర్లో సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా వాటిని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి నేటితో 44 రోజులు అవుతోంది.

Rockets Strike Train Station In East Ukraine : ఈ ఏడాది పిబ్రవరి చివర్లో సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా వాటిని కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌పై దాడికి దిగి నేటితో 44 రోజులు అవుతోంది. అమెరికాతో పాటు యూరప్ దేశాలు ఆంక్షలు విధిస్తున్నా.. ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నా..పుతిన్ మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. తగ్గేదే లే అన్నట్లుగా.. ఉక్రెయిన్‌ ను ఉక్కబిరిబిక్కిరి చేస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. బలగాలను ఉపసంహరిస్తామన్న రష్యా మాట మార్చింది. ఉక్రెయిన్‌ లోని పలు ప్రాంతాలపై ఇంకా క్షిపణులతో విరుచుకుపడుతోంది.

అయితే తాజాగా తూర్పు ఉక్రెయిన్ ​లోని ఓ రైల్వే స్టేషనే లక్ష్యంగా పుతిన్ సైన్యం రెండు రాకెట్లు ప్రయోగించడం ఈ పెను విషాదానికి దారితీసింది. రష్యా రాకెట్ దాడుల్లో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా..100 మందికిపైగా  గాయపడినట్లు సమాచారం. దాడికి గురైన రైల్వే స్టేషన్​ ను.. ఉక్రెయిన్​ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్తున్న వారి ప్రయాణాల కోసం ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుల్లో ఎక్కువ మంది సామాన్యులే ఉంటారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి మరియు మూడు నాటో మిత్రదేశాల మధ్య భద్రతా సంబంధాలపై చర్చించడానికి టర్కీ, బ్రిటన్ మరియు ఇటలీ రక్షణ మంత్రులు నేడు ఇస్తాంబుల్‌లో సమావేశం కానున్నారు. ఈ సమయంలో ఉక్రెయిన్ రైల్వే స్టేషన్ పై రష్యా రాకెట్ దాడులు కలకలం రేపాయి. ఇక,బోరోడియాంకా పట్టణంలో రష్యా దళాలు చేసిన విధ్వంసం సమీప పట్టణమైన బుచాలో బయటపడిన పరిస్థితి కంటే చాలా భయంకరమైనది అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు.  రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య చర్చలకు ఆతిథ్యం ఇస్తున్న టర్కీ దేశ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ..బుచా మరియు ఇతర ప్రాంతాల నుండి ఇటీవల బయటకొచ్చిన చిత్రాలు "సఫలమవుతున్న చర్చల సానుకూల వాతావరణం"ని చెడగొట్టేలా ఉన్నాయని అన్నారు.

ALSO READ USA Vs Russia: రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తెలపై అమెరికా దృష్టి.. కారణం అదేనా..?

మరోవైపు,ఈ యుద్ధంలో భారీగా సైనికులను కోల్పోయినట్లు ఇప్పటివరకు అంగీకరించని రష్యా...తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. క్రెమ్లిన్ ప్ర‌తినిధి దిమిత్రీ పెస్కోవ్ తాజాగా ఓ ఛాన‌ల్‌ తో మాట్లాడుతూ.. భారీ స్థాయిలో ఉక్రెయిన్ లో తమ ద‌ళాల్ని కోల్పోయామ‌ని, ఇది విషాద‌క‌ర‌మ‌ని అన్నారు. అయితే త్వ‌ర‌లోనే త‌మ యుద్ధ ల‌క్ష్యాల‌ను అందుకోనున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Russia, Russia-Ukraine War, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు