13500 Russian Soldiers Died : రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజు రోజుకు దాడులను మరింత తీవ్రతరం చేస్తోంది. క్షిపణులతో దాడులు చేస్తూ భయానక పరస్థితులను సృష్టిస్తోంది. ఈ దాడులతో సుందర నగరాలు మసి దిబ్బలుగా మారిపోయాయి. అయితే ఉక్రెయిన్ రెండు మూడు రోజుల్లోనే లొంగిపోతుందని, రష్యా శక్తిసామర్థ్యాల ముందు నిలవడం కష్టమని యుద్ధం ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరూ భావించారు. కానీ అందరి అంచనాలను, ఊహాగానాలను పటాపంచలు చేస్తూ మూడు వారాలుగా రష్యా భీకర దాడులను ఉక్రెయిన్ సైన్యం సమర్థంగా ఎదుర్కొంటోంది. కీలక నగరాలను స్వాధీనం చేసుకోవాలని యత్నిస్తున్న పుతిన్ సేనలను ముప్పుతిప్పలు పెడుతోంది. అమెరికా, బ్రిటన్, మరికొన్ని నాటో దేశాలు ఉక్రెయిన్ కు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నాయి. నిధులను, యుద్ధ సామాగ్రిని సమకూరుస్తున్నాయి. దీంతో రష్యన్ ఆర్మీని ఉక్రెయిన్ తీవ్రంగా ఎదుర్కొంటోంది.
ALSO READ ఉక్రెయిన్పై కొత్తరకం ఆయుధాలను ప్రయోగిస్తున్న రష్యా.. గుర్తించలేకపోతున్న ఇంటెలిజెన్స్
అయితే యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు 13500 రష్యా సైనికులను హతమర్చామని, 81 యుద్దవిమనాలను, 95 హెలికాప్టర్లను నేలకూల్చినట్లు తాజాగా ఉక్రెయిన్ వెల్లడించింది. 404 యుద్ధ ట్యాంకులను, 1279 సాయుధ వాహనాలను, 3 నౌకలు, 36 యాంటీ ఏయిర్ క్రాప్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఉక్రెయిన్ యుద్ధంలో విజయం సాధించడానికి కేవలం పది రోజుల సమయం మాత్రమే ఉందని, రష్యా దళాలు కట్టుదిట్టం చేశాయని అమెరికా, రష్యా రక్షణ రంగ నిపుణులు పేర్కొన్నారు. గేమ్ రష్యాకు సమీపంలో ఉందని అన్నారు.
మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్ లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు నగర మేయర్ విటాలి క్లిష్కో ప్రకటించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ఆంక్షలు ప్రారంభమవుతాయని చెప్పారు. మార్చి 17 ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. బాంబు షెల్టర్లలోకి వెళ్లేందుకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని మేయర్ సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Russia, Russia-Ukraine War, Ukraine, Vladimir Putin, Zelensky