అక్రమాస్తుల కేసులో నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష..

సౌదీ అరేబియాలో షరీఫ్ నెలకొల్పిన అల్అజీజియా స్టీల్ మిల్స్‌ పెట్టుబడుల వ్యవహారంలో అవినీతి జరిగినట్టు వెల్లడైంది.

news18-telugu
Updated: December 24, 2018, 11:08 PM IST
అక్రమాస్తుల కేసులో నవాజ్ షరీఫ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష..
నవాజ్ షరీఫ్, మరియం నవాజ్(File)
  • Share this:
అక్రమాస్తుల కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అవినీతి నిరోధక న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. సౌదీ అరేబియాలో షరీఫ్ నెలకొల్పిన అల్అజీజియా స్టీల్ మిల్స్‌ పెట్టుబడుల వ్యవహారంలో అవినీతి జరిగినట్టు వెల్లడైంది. మిల్ స్థాపనకు సమకూరిన పెట్టుబడి ఆదాయ వనరులను షరీఫ్ చూపించలేకపోయారని కోర్టు పేర్కొంది.

ఈ ఏడాది జులైలో ఇదే కోర్టు షరీఫ్‌కు 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. లండన్‌ అక్రమాస్తుల కేసులో షరీఫ్‌కు ఈ శిక్ష పడింది. అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ షరీఫ్ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో.. కేవలం రెండు నెలల జైలు శిక్ష అనంతరం బయటపడ్డారు. అయితే తాజాగా మరో అక్రమాస్తుల కేసులోనూ షరీఫ్‌కు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధించడంతో ఆయన మద్దతుదారులు నిరసనలకు దిగుతున్నారు.

కోర్టు తీర్పుపై అప్పీల్‌కు వెళ్లే అవకాశం మాకు ఉంది. అంతవరకు శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తాం. ప్రజలు ఈ తీర్పును ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. షరీఫ్‌పై అక్రమ కేసులు బనాయించి ఆయన్ను ఇరికిస్తున్నారు.
షాహిద్ ఖకాన్ అబ్బాసీ, మాజీ పాక్ ప్రధాని
First published: December 24, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>