హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China: ఛీ..ఛీ.. చైనాలో మరింత ఇంత దారుణమా.. అసలు వీళ్లు మనుషులేనా ?

China: ఛీ..ఛీ.. చైనాలో మరింత ఇంత దారుణమా.. అసలు వీళ్లు మనుషులేనా ?

China: చైనాలో 1984 నుండి మరణశిక్ష పడిన ఖైదీల శరీరాల నుండి అవయవాలను తొలగించడం చట్టబద్ధమైనది.

China: చైనాలో 1984 నుండి మరణశిక్ష పడిన ఖైదీల శరీరాల నుండి అవయవాలను తొలగించడం చట్టబద్ధమైనది.

China: చైనాలో 1984 నుండి మరణశిక్ష పడిన ఖైదీల శరీరాల నుండి అవయవాలను తొలగించడం చట్టబద్ధమైనది.

  అనేక అంశాలకు సంబంధించి చైనా తరచూ వార్తల్లో నిలుస్తుంది. క‌రోనా వ్యాప్తి కూడా చైనాలోనే మొదలైంది. చైనా కావాలనే కరోనా వైరస్‌ను సృష్టించి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మరోసారి కరోనా దెబ్బకు డ్రాగన్ దేశం విలవిల్లాడిపోతోంది. కరోనా గురించి కాసేపు పక్కనపెడితే.. ఆ దేశ ప్రజల స్వేచ్ఛపై అక్కడి ప్రభుత్వ నియంత్రణ ఉంటుందనే వాదన కూడా ఉంది. చైనా నుంచి వస్తున్న పలు వార్తలను బట్టి అక్కడి ప్రజల జీవితాలు ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయని వెల్లడైంది. వారు తమ ఇష్టానుసారం ప్రజలను నడిపిస్తారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన వార్తల కూడా ఒక సంచలనమే. చైనాలో ఖైదీలను మరణానికి ముందే చంపేస్తున్నారన్నది ఈ వార్త సారాంశం. ఈ ఖైదీలకు జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధించబడింది. అయితే మరణానికి ముందే వారి శరీరాల నుంచి కిడ్నీలు, గుండె (ఆర్గాన్స్ హార్వెస్టింగ్ ఇన్ చైనా)ని తొలగిస్తున్నారు.

  చైనాలో 1984 నుండి మరణశిక్ష పడిన ఖైదీల శరీరాల నుండి అవయవాలను తొలగించడం చట్టబద్ధమైనది. అయితే ఇప్పుడు చైనాలోని కొంతమంది ఖైదీల శరీరాల నుండి మరణానికి ముందు అవయవాలను తొలగిస్తారని మానవ హక్కుల సంఘాలు చెబుతున్నాయి. అవయవ మార్పిడి కోసం చైనా అతి తక్కువ నిరీక్షణ వ్యవధిని కలిగి ఉంది. అయితే అక్కడ చాలా తక్కువ మంది దాతలు ఉన్నారు. దీంతో తాజా వాదనకు బలం చేకూరుతోంది.

  ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన మాథ్యూ రాబర్ట్‌సన్ బ్రెయిన్ డెడ్ కావడంతో సర్జరీ చేశారు. చైనాలోని కొన్ని జైళ్లలో ఖైదీలు జీవించి ఉండగానే వారికి శస్త్రచికిత్స చేసినట్లు పరిశోధనలో తేలింది. ఈ నివేదిక అమెరికన్ జర్నల్ ఆఫ్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ప్రచురించబడింది. బ్రెయిన్ డెడ్ అని చెప్పి ఖైదీల నుంచి కిడ్నీలు, గుండెలు బయటకు తీస్తున్న విషయం తెరపైకి వచ్చింది. వారిలో కొందరికి బ్రెయిన్ డెడ్ అని ప్రకటించకుండానే సర్జరీ చేయాల్సి వచ్చింది.

  Ukraine-Russia War: పారని రష్యా ఎత్తులు.. తుస్సుమంటున్న బాంబులు..! ఉక్రెయిన్ లో జరుగుతోంది ఇదే..

  Oh My God: యువకుడి ప్రాణం కాపాడిన హెడ్‌ఫోన్స్... తలలోకి బుల్లెట్ దూసుకెళ్లకుండా అడ్డుకుంది ఇలా

  మరణశిక్ష పడిన ఖైదీల శరీరం నుంచి కిడ్నీ లివర్‌ను తొలగించి, వారి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకూడదనే చట్టం 1984 నుంచి చైనాలో ఆమోదించబడింది. కానీ 2019లో అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఖైదీలను మరణానికి ముందే చంపేస్తున్నారని కనుగొంది. వారి శరీరం నుంచి కిడ్నీలు, గుండెలు బయటకు తీస్తున్నారని వెల్లడించింది.

  First published:

  Tags: China

  ఉత్తమ కథలు