Home /News /international /

OPERATION GANGA GAINS SPEED INDIGO AI EXPRESS SPICEJET JOIN AIR INDIA IN BRINGING BACK INDIANS GH VB

Mission Ganga: ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తరలించడంలో నిమగ్నమైన అధికారులు.. కొనసాగుతున్న ‘మిషన్‌ గంగ’..!

ప్రతీకాత్మక చిత్రం(Photo - ANI)

ప్రతీకాత్మక చిత్రం(Photo - ANI)

ఉక్రెయిన్‌కు పూర్తిగా విమాన ప్రయాణాలు రద్దు కావడంతో చాలా మంది విదేశీయులు అక్కడే చిక్కుకుపోయారు. వారందరినీ వెనక్కి తీసుకొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు వివిధ మార్గాల ద్వారా కృషి చేస్తున్నాయి. ఇందుకు భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ‘మిషన్‌ గంగ’ ప్రాజెక్టు చేపట్టిం

ఇంకా చదవండి ...
రష్యా(Russia), ఉక్రెయిన్‌(Ukraine) మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న తమ దేశ ప్రజలను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఉక్రెయిన్‌లో గగనతల ప్రయాణాలు రద్దు కాకముందే యుద్ధ హెచ్చరికల నేపథ్యంలో కొంత మంది స్వదేశాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఉక్రెయిన్‌కు పూర్తిగా విమాన ప్రయాణాలు రద్దు కావడంతో చాలా మంది విదేశీయులు అక్కడే చిక్కుకుపోయారు. వారందరినీ వెనక్కి తీసుకొనేందుకు ఆయా దేశ ప్రభుత్వాలు వివిధ మార్గాల ద్వారా కృషి చేస్తున్నాయి. ఇందుకు భారత ప్రభుత్వం(Indian Government) ప్రత్యేకంగా ‘మిషన్‌ గంగ(Mission Ganga)’ ప్రాజెక్టు చేపట్టింది. హంగేరి, పొలాండ్‌, స్లొవేకియా, రొమేనియా వంటి ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు ప్రజలను తరలించి అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు. భారత కేంద్ర మంత్రులు, సైనికాధికారులు ఆపరేషన్‌ గంగ (Operation Ganga) పనులను పర్యవేక్షిస్తున్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లోని భారత దౌత్య కార్యాలయ అధికారులు అక్కడి భారత విద్యార్థులను, ఉద్యోగులను రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది.

ఇప్పటి వరకు ఉక్రెయిన్‌లో చిక్కుకొన్న వారిని వెనక్కి రప్పించడంలో ఇతర దేశాల కంటే భారత్‌ ముందు ఉంది. వాస్తవానికి వెస్ట్రెన్‌ ఉక్రెయిన్‌ ప్రాంతంలో స్ట్రీట్‌ పైట్స్‌ జరుగుతుండటంతో అక్కడి నుంచి ప్రజలను తరలించడం కష్టతరంగా మారింది. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు చల్లబడ్డాక విద్యార్థులను తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు తరలింపు పనులు చేపట్టడం ప్రమాదకరం కూడా. ఉక్రెయిన్‌లో దాదాపు 80,000 మంది విదేశీ విద్యార్థులు చదువుకొంటున్నారని ఉక్రెయిన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ సైన్స్‌ మినిస్ట్రీ వెల్లడించింది. వారిలో ఎక్కువ మంది ఇండియా నుంచి ఉన్నారని, ఆ తర్వాత మొరాకో, అజర్ బైజాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, నైజీరియా విద్యార్థులు ఉన్నారని తెలిపింది. చైనాకు చెందిన దాదాపు 6,000 వేల మంది చైనా ప్రజలు ఉక్రెయిన్‌లో ఉంటున్నారు. చైనా ప్రజలు ఉక్రెయిన్‌ దాటే ముందు వాహనాలకు చైనా జెండా పెట్టుకోవాలని ఆ దేశ అధికారులు సూచించారు. అయితే ఉక్రెయిన్లతో చైనీయులు గొడవలు పెట్టుకోవద్దని, సోషల్‌ మీడియాలో చైనా దేశస్థులపై దాడులు జరుగుతున్నాయని తెలిసిందని ఓ ఉన్నతాధికారి వీడియో మెసేజ్‌లో వివరించారు.

Viral video: కలెక్టరేట్‌లోకి పాములు వదిలిన రైతులు.. మిగతా ప్రభుత్వ ఆఫీసుల్లోనూ కలకలం.. కారణమిదే


ఇండియాకు చెందిన విమానాలు ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు ఎక్కువగా తిరుగుతున్న నేపథ్యంలో చైనీయులు ప్రయాణాలను ఆపేసుకొన్నట్లు సమాచారం. ఇండియా జెండా ఉన్న వాహనాలకు సురక్షిత మార్గం లభిస్తుండగా చైనీయులపై అక్కడక్కడా దాడులు జరుగుతుండటం గమనార్హం. హెల్ప్‌లైను నంబర్లు, ఇతర సహకారం భారత ప్రభుత్వం అందించగా చైనా ఎలాంటి సూచనలు చేయకపోవడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా ప్రజలను సురక్షితంగా తీసుకురాలేమని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. హెల్ప్‌ లైన్‌ నంబర్లు, ఏ సరిహద్దుల వద్ద ఇతర దేశాలకు చేరవచ్చు అనే వివరాలను అందించింది. సరిహద్దు దేశాలకు చేరుకొని అందుబాటులో ఉన్న మార్గాల్లో తిరిగి రావాలని తెలిపింది. ఇండియా ‘మిషన్‌ గంగా’ ప్రాజెక్టును చురుగ్గా చేపడుతుండగా.. ఇదే సమయంలో అమెరికా మాత్రం ఎలాంటి ఆపరేషన్ చేపట్టలేమని చెప్పడం గమనార్హం.

బ్రిటిష్‌ ప్రభుత్వం ఉక్రెయిన్‌లోని తమ దేశస్థులకు మరింత సహకారం అందించే అవకాశం లేదని తెలిపింది. కీవ్‌లో ఉన్న దౌత్య కార్యాలయాన్న మరో ప్రాంతానికి మార్చింది. ఉద్యోగులు ఆన్‌లైన్‌ ద్వారా పని చేస్తున్నారు. అదే సమయంలో భారత కార్యాలయం ఉన్నచోటనే పనిచేస్తుండటం గమనార్హం. ఉక్రెయిన్‌ అధికారుల సూచనలు పాటించాలని బ్రిటిష్‌ ప్రభుత్వం తెలిపింది. అమెరికన్లు ఉక్రెయిన్‌ నుంచి వెంటనే వచ్చేయాలని ఫిబ్రవరి 12న ప్రకటించిన వెంటనే జర్మనీ కూడా ఆదేశాలిచ్చింది. కీవ్‌లోని జర్మనీ కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సూచనలు, హెల్ప్‌లైన్‌ నంబర్లు, ఇతర సహాయాలకు ఆన్‌లైన్‌ ఫార్మ్‌ను విడుదల చేసింది. జర్మన్‌ దేశానికి సురక్షితంగా తీసుకొచ్చే పరిస్థితులు లేవని చెప్పింది.

International Flights : అంతర్జాతీయ విమానాలపై భారత్ నిషేధం మళ్లీ పొడిగింపు: DGCA


ఈజిప్టుకు చెందిన విద్యార్థులను సురక్షితంగా పంపించాలని ఉక్రెయిన్‌ ప్రభుత్వంతో గత వారం ఈజిప్టు నేతలు చర్చించినట్లు సమాచారం. అయితే ఇప్పటికీ ఈజిప్టు దౌత్య కార్యాలయానికి సాయం కోసం ఆదేశ విద్యార్థుల నుంచి ఫోన్లు వస్తుండటం గమనార్హం. కొందరు సొంతంగా ఇతర దేశాలకు చేరుకొన్నారు. మొరాకో తమ దేశస్థులను తరలించేందుకు కీలక చర్యలు తీసుకొంటోంది. సరిహద్దు దేశాలకు చేరుకొనే మార్గాలను, ఉచిత ఫోన్‌ నంబర్లను ప్రకటించింది. ఉక్రెయిన్‌, పొలాండ్‌, స్లొవేకియా, రొమేనియా, హంగేరి వైపు చాలా మంది మొరాకో ప్రజలు ప్రయణమయ్యారు. రష్యా హఠాత్తుగా తీసుకొన్న నిర్ణయం ఆశ్చర్యానికి గురి చేసిందని నైజీరియా స్పందించింది. పరిస్థితులు చక్కబడ్డాక నైజీరియా ప్రజలను తరలించే పనులు చేపడుతామంది. అయితే మీ రక్షణ మీరే చేసుకోండి అనే తరహాలో నైజీరియా ప్రభుత్వం స్పందించినట్లు ఆ దేశస్థులు ఆరోపిస్తున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: International news, Mission ganga, Russia, Ukraine

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు