ఒపెక్ ఒప్పందం: తగ్గనున్న చమురు ఉత్పత్తి... పెరగనున్న పెట్రోల్ ధరలు

ఒపెక్ సభ్య దేశాల మధ్య చమురు ఉత్పత్తిని తగ్గించే అంశంపై ఓ డీల్ కుదిరింది. రోజుకు 12 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించబోతున్నాయి. ఏ దేశాలు ఎంత కోత విధించుకోవాలనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. తాజా ఒప్పందంతో చమురు ధరలు 5 శాతం పెరిగాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: December 8, 2018, 6:22 AM IST
ఒపెక్ ఒప్పందం: తగ్గనున్న చమురు ఉత్పత్తి... పెరగనున్న పెట్రోల్ ధరలు
చమురు ఉత్పత్తి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తగ్గుతున్న చమురు ధరలను నియంత్రించేందుకు పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) చమురు ఉత్పత్తిని తగ్గించేందుకు ఒప్పుకుంది. ఐతే, ఒపెక్‌లో సభ్యత్వం లేని రష్యా... ఎంతవరకూ తన చమురు ఉత్పత్తిని తగ్గించుకుంటుందో తెలిసిన తర్వాత... తమ సభ్య దేశాలు ఎంత శాతం తగ్గించుకోవాలో నిర్ణయం తీసుకుంటాయని తెలిపింది. ప్రస్తుతానికి అన్ని చమురు ఉత్పత్తి దేశాలూ కలిసి రోజుకు 12 లక్షల పీపాలను మార్కెట్‌కు తరలించకుండా నిలిపివేయబోతున్నాయి. ఈ 12 లక్షల్లో... 8 లక్షల పీపాల వరకూ ఒపెక్ తన వంతుగా ఉత్పత్తిని తగ్గించుకోనుంది. చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటైన ఇరాన్ మాత్రం ఈ డీల్‌ నుంచీ తప్పించుకున్నట్లైంది. ఆ దేశం ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పనిలేకుండా పోయింది. ఐతే, ఇరాన్‌పై ఇప్పటికే అమెరికా ఆంక్షలున్నాయి. అందువల్ల ఆ దేశం ఉత్పత్తి చేసిన చమురును చాలా దేశాలు దిగుమతి చేసుకోవడం తగ్గించాయి. వాటిలో భారత్ కూడా ఉంది.

petrol price in india, petrol price hike, OPEC, petrol diesel price, petrol price today, petrol price today india, price rise, diesel price today, diesel prices going up, fuel price hike in india, ఒపెక్ సభ్య దేశాల మధ్య చమురు ఉత్పత్తిని తగ్గించే అంశంపై ఓ డీల్ కుదిరింది. రోజుకు 12 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించబోతున్నాయి. ఏ దేశాలు ఎంత కోత విధించుకోవాలనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. తాజా ఒప్పందంతో చమురు ధరలు 5 శాతం పెరిగాయి. OPEC and Fuel Producing countries agree to cut oil production by 1.2 million barrels per day
ప్రతీకాత్మక చిత్రం..

ఒపెక్ సూత్రప్రాయ అంగీకారంతో... చమురు ధరలకు రెక్కలొచ్చాయి. లండన్‌లో వెంటనే 5.4 శాతం ధరలు పెరిగాయి. ఈ మొత్తం వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహంగా ఉన్నారు. ఉత్పత్తిని తగ్గిస్తే కుదరదని తేల్చిచెప్పారు. తాజా నిర్ణయం ఏప్రిల్ వరకూ అమల్లో ఉంటుంది. ఏప్రిల్ తర్వాత చమురు ఉత్పత్తి చేసే దేశాలు కొత్త ఒప్పందాలు చేసుకుంటాయి. ఐతే... తాజా నిర్ణయం అమలు చేయడానికి రష్యా తీసుకోబోయే నిర్ణయం కీలకం కానుంది. రష్యా రోజుకు లక్ష నుంచీ లక్షన్నర పీపాల ఉత్పత్తిని తగ్గించుకోవాలని అనుకుంటోంది. అది సరిపోదనీ, మరింత ఎక్కువ ఉత్పత్తిని నిలిపివేయాలని ఒపెక్ కోరుతోంది.

petrol price in india, petrol price hike, OPEC, petrol diesel price, petrol price today, petrol price today india, price rise, diesel price today, diesel prices going up, fuel price hike in india, ఒపెక్ సభ్య దేశాల మధ్య చమురు ఉత్పత్తిని తగ్గించే అంశంపై ఓ డీల్ కుదిరింది. రోజుకు 12 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించబోతున్నాయి. ఏ దేశాలు ఎంత కోత విధించుకోవాలనేదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. తాజా ఒప్పందంతో చమురు ధరలు 5 శాతం పెరిగాయి. OPEC and Fuel Producing countries agree to cut oil production by 1.2 million barrels per day
ప్రతీకాత్మక చిత్రం

మోదీ అభిప్రాయం కీలకం : సౌదీ మంత్రి ఖలీద్‌
క్షీణిస్తున్న చమురు ధరలను నియంత్రించేందుకు వీలుగా, చమురు ఉత్పత్తిని తగ్గించే ముందు ప్రధాని నరేంద్ర మోదీ లాంటి ప్రపంచ నేతల అభిప్రాయాల్ని లెక్కలోకి తీసుకుంటామని సౌదీ చమురు శాఖ మంత్రి ఖలీద్‌ అల్‌ ఫలీ తెలిపారు. ప్రపంచంలో చమురు ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మూడో అతిపెద్ద దేశం భారత్‌. దేశ ఇంధన అవసరాలు తీర్చేందుకు 80 శాతానికిపైగా చమురు దిగుమతులపైనే మనం ఆధారపడుతున్నాం. ఒపెక్ నిర్ణయం అమలైతే... ప్రస్తుతం తగ్గుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉంటుంది.
First published: December 8, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading