కిలో ఉల్లి రూ. 220... వాడొద్దని ప్రధాని నిర్ణయం

భారత్‌ నుంచి ఉల్లి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.220 కు చేరింది.

news18-telugu
Updated: November 18, 2019, 12:53 PM IST
కిలో ఉల్లి రూ. 220... వాడొద్దని ప్రధాని నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కిలో ఉల్లి ధర రూ. 50 దాటితేనే మన దేశ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉల్లి ధర మళ్లీ ఎప్పుడు దిగొస్తుందా ? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఉల్లి ధర రూ. 220 ఉంటే... అసలు దాని జోలికి సామాన్యులు వెళ్లగలరా ? మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. భారత్‌ నుంచి ఉల్లి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయల ధర రూ.220 కు చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్‌, చైనా నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

పలు ప్రాంతాల్లో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి కిలో ఉల్లి రూ.38కి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఉల్లి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తన నివాసంలో ఉల్లి వాడొద్దని బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసినా నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని పలు ప్రాంతాల్లో ఉల్లి కిలో రూ.70 కి చేరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంటలు దెబ్బతినడంతో... ఒక్కసారిగా ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి.

First published: November 18, 2019, 12:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading