హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

gunfire against vigil: అమెరికాలోని ఓ వేడుకలో విషాదం.. జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగులు

gunfire against vigil: అమెరికాలోని ఓ వేడుకలో విషాదం.. జనంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన దుండగులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవలె మిచిగాన్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో 15 ఏళ్ల విద్యార్ధి కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను చంపాడు. ఈ ఘటన మరిచిపోకముందే అమెరికాలోని హ్యూస్టన్‌ (Houston‌)లో ఆగంతకులు కాల్పులు జరిపారు.

అమెరికా (America)లో తుపాకులు లైసెన్సులు చాలా ఈజీగా దొరుకుతాయి. తుపాకీ హింసను అరికట్టడం కోసం ప్రభుత్వం చట్టం తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ చట్టాన్ని కొందరు సమర్థిస్తుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. కానీ తుపాకీ హింస వల్ల ప్రతిరోజూ అమాయకులు చనిపోతున్నారు. ఇటీవలె మిచిగాన్‌లోని ఒక ఉన్నత పాఠశాలలో 15 ఏళ్ల విద్యార్ధి కాల్పులు జరిపి నలుగురు విద్యార్థులను చంపాడు. గాయపడిన వారిలో 17 ఏళ్ల బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాల్పుల్లో మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన మరిచిపోకముందే అమెరికాలోని హ్యూస్టన్‌ (Houston‌)లో ఆగంతకులు కాల్పులు (Strangers Firing) జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారు.

స్థానికంగా పండుగ (candlelight vigil)ను పురస్కరించుకుని ఇక్కడకు చేరిన ప్రజలపై ఆదివారం రాత్రి ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ మేరకు ఓ అధికారి సమాచారం అందించారు. బేటౌన్ నార్త్ మార్కెట్ లూప్ (North Market Loop in Baytown) సమీపంలో వేడుక కోసం దాదాపు 50 మంది వ్యక్తులు గుమిగూడిన సమయంలో సాయంత్రం 6.40 గంటలకు కాల్పులు జరిగినట్లు హారిస్ కౌంటీ షెరీఫ్ ఎడ్ గొంజాలెజ్ (Ed Gonzalez, head of the Harris County Sheriff’s Office) తెలిపారు.

ఈ ప్రజలు సంబరాలు (candlelight vigil) చేసుకుంటున్నారని మరియు గాలిలో బెలూన్‌లను వదులుతున్నారని, ఒక వాహనం అక్కడికి చేరుకుని గుంపుపైకి కాల్పులు (gunfire against vigil) జరిపిందని అతను చెప్పాడు. మరణించిన వ్యక్తికి సుమారు 20-22 సంవత్సరాల వయస్సు ఉంటుందని గొంజాలెజ్ సోమవారం ఉదయం చెప్పారు. గాయపడిన ముగ్గురిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు ఆయన చెప్పారు.

క్షతగాత్రులలో (In Injuries) చిన్న పిల్లాడు కూడా ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా అలజడి చెలరేగడంతో కొంత మంది గాయపడిన వారిని తీసుకెళ్లిన తరువాత అధికారులను బేటౌన్ మెడికల్ సెంటర్‌కు పిలిచారని గొంజాలెజ్ చెప్పారు. దాడి చేసినవారు చిన్న, ముదురు రంగు సెడాన్‌ను నడుపుతున్నట్లు అనుమానిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా అరెస్టులు ఏవీ జరగలేదని చెప్పారు.

కాగా, ఇటీవలె క్రిస్​మస్​ వేడుకల్లో విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్‌ (Christmas) పర్వదినాన్ని పురస్కరించుకుని విస్కాన్‌సిన్‌ రాష్ట్రంలోని మిల్‌వాకీ వాసులు క్రిస్మస్‌ వార్షిక పరేడ్‌ను చేసుకుంటున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి ఎస్‌యూవీ వాహనంలో వచ్చి అడ్డుగా ఉన్న బారీకేడ్లను అత్యంత వేగంతో కారుతో ధ్వంసం చేసి వాకీషాలో పరేడ్​ (Waukesha parade)గా వెళ్తున్న జనం మీదుగా పోనిచ్చాడు దుండగుడు. దీంతో జనం హాహాకారాలతో పరుగులు తీశారు. ఐదుగురు మరణించారు. మరో 40 మందికిపైగా గాయపడ్డారు. వెంటనే తేరుకున్న అక్కడి పోలీసులు ఆ వాహనంపైకి పలుమార్లు కాల్పులు జరిపారు. ఆగంతకుడు ఆ కారులో వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. క్రిస్మస్‌ పరేడ్‌ (parade) కోసం ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల్లో, స్థానికుల సెల్‌ఫోన్లలో ఈ దారుణ ఘటన అంతా రికార్డయింది.

First published:

Tags: America, Gun fire

ఉత్తమ కథలు