ఇరాక్‌లో మళ్లీ అమెరికా వైమానిక దాడులు... ఆరుగురు మృతి

ఇరాన్ టార్గెట్‌గా... ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా మళ్లీ వైమానిక దాడులకు దిగింది.

news18-telugu
Updated: January 4, 2020, 8:36 AM IST
ఇరాక్‌లో మళ్లీ అమెరికా వైమానిక దాడులు... ఆరుగురు మృతి
ఇరాక్‌లో మళ్లీ అమెరికా వైమానిక దాడులు... ఆరుగురు మృతి... (file - twitter - WW3)
  • Share this:
ఇరాన్ మిలిషియా కమాండర్లే లక్ష్యంగా... అమెరికా మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జరిపిన దాడిలో... ఓ కమాండర్ సహా... ఆరుగురు చనిపోయారు. చూస్తుంటే... అమెరికా మరిన్ని దాడులకు పాల్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ సరిహద్దుల్లో అమెరికా భారీ ఎత్తున బలగాల్ని మోహరించింది. దానికి తోడు... ఇరాన్‌ మరో యుద్ధం చేసే ఛాన్స్ లేకుండా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అందువల్ల అమెరికా మరిన్న దాడులకు పాల్పడవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే... పశ్చిమాసియాలో అశాంతి మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ప్రజలంతా ఇరాన్ ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతు ఇస్తూ... ఆమెరికా సైన్యంపై ప్రతీకారం పెంచుకునే ప్రమాదం ఉందంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు.


తాజా దాడిని చూసినప్పుడు... ఇరాన్‌పై కోపం ఉంటే... ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఎందుకు దాడులు చేస్తోందన్న డౌట్ రావచ్చు. ఎందుకంటే... ఇరాన్‌కి చెందిన దౌత్య వేత్తలు... ఇరాక్‌లో ఉన్నారు. వాళ్లకు అండగా ఇరాన్ మిలిషియా కమాండర్లు పనిచేస్తున్నారు. అందువల్ల ఇరాన్ పాలకులను దెబ్బతియ్యాలంటే... ఆ దేశ దౌత్యవేత్తల్ని, కమాండర్లనూ టార్గెట్ చెయ్యాలని అమెరికా ఫిక్సైంది. అందుకు ఇరాక్‌ భూమిని ఎంచుకుంది. ఇరాక్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదంటూనే... అక్కడే దాడులు చేస్తూ... ఆ దేశంలో అలజడి సృష్టిస్తోంది.

First published: January 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు