16 Year old Finland PM: 16 ఏళ్లకే ఫిన్‌ల్యాండ్ ప్రధానమంత్రి... ఎలా?

16 Year old PM: మన దేశంలో... ఎమ్మెల్యే అవ్వాలంటేనే... కనీసం 30 ఏళ్లు దాటేస్తుంది. అలాంటిది ఆ బాలిక... 16 ఏళ్లకే ఫిన్‌ల్యాండ్ ప్రధాన మంత్రి ఎలా అయ్యింది?

news18-telugu
Updated: October 10, 2020, 12:09 PM IST
16 Year old Finland PM: 16 ఏళ్లకే ఫిన్‌ల్యాండ్ ప్రధానమంత్రి... ఎలా?
16 ఏళ్లకే ఫిన్‌ల్యాండ్ ప్రధానమంత్రి (credit - twitter)
  • Share this:
16 Year old PM to Finland: ఆ బాలిక వయసు 16 ఏళ్లు. పేరు లావా మూర్తో. టీనేజ్ వయసులోనే... "పర్యావరణాన్ని కాపాడండి... ప్రకృతిని బతికించండి" అంటూ.. రకరకాల క్యాంపెయిన్లలో పాల్గొంటోంది. చాలా సందర్భాల్లో పర్యావరణానికి సంబంధించిన మానవ హక్కుల అంశాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. అలా ఉంటూ... తాజాగా ఫిన్‌ల్యాండ్ ప్రధాన మంత్రి అయిపోయింది. ఎంతో అభివృద్ధి చెందిన ఫిన్‌ల్యాండ్‌లోనూ... లింగ వివక్ష బాగా ఉంది. దేశంలో అమ్మాయిల కంటే... అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. అమ్మాయిల పట్ల దేశ ప్రజల్లో పాజిటివ్ ఫీలింగ్ కలిగించేందుకు ప్రస్తుత మహిళా ప్రధానమంత్రి సనా మార్టిన్... లావా మూర్తోను ఒకరోజు ప్రధానమంత్రిగా ప్రకటించారు. బుధవారం ఒక్కరోజు తన పదవి నుంచి తప్పుకున్న మార్టిన్... ఆ స్థానాన్ని లావా మూర్తోకి అప్పగించారు. అంతే... ఆ దేశానికి వన్ డే పీఎం అయిపోయిన ఆ బాలిక... వెంటనే... ప్రెస్‌మీట్ పెట్టి... డిజిటల్ రంగంలో మహిళల హక్కులపై అనర్గళంగా ప్రసంగించింది.


ఫిన్‌ల్యాండ్‌లో నాలుగేళ్లుగా ఇదో సంప్రదాయంలా మారింది. గర్ల్స్ టేకోవర్ పేరుతో... ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుతున్నారు. ఎవరైతే సమాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారో... అలాంటి బాలికలకు వన్ డే ప్రధానమంత్రి అయ్యేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇలా ప్రధాని అయ్యేవారు... ఫిన్‌లాండ్ అమ్మాయిలే అవ్వాల్సిన పనిలేదు. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా వచ్చి... అరుదైన అవకాశం పొందొచ్చు. బాలికలు, మహిళలకు డిజిటల్ స్కిల్స్, టెక్నాలజీ అవకాశాల్ని మరింతగా కల్పించాలన్నది ఈ సంవత్సరం థీమ్. కెన్యా, పెరు, సూడాన్, వియత్నాం వంటి దేశాల్లో ఈ దిశగా ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే... మూర్తో కూడా... ఇదే అంశంపై మాట్లాడింది.

"మీ ముందు ఇలా మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. నిజానికి నాకు ఇలాంటి అవకాశం రావడం ఇష్టం లేదు. ఎందుకంటే... మహిళల హక్కుల కోసం పోరాడుతూ... ఈ అవకాశం నేను పొందాను. అసలా పోరాటాలు ఇంకా కొనసాగుతుండం నాకు నచ్చలేదు. ఈ పరిస్థితి మారాలి"... అంటూ ప్రసంగించిన మూర్తో... "స్త్రీ-పురుష లింగ సమానత్వాన్ని ఇంకా మనం పొందలేదు. ఇప్పటికే మనం చాలా చేశాం. ఇంకా చెయ్యాల్సింది చాలా ఉంది." అని తెలిపింది.
గతేడాది ఫిన్‌ల్యాండ్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు 34 ఏళ్ల మార్టిన్. తద్వారా ప్రపంచంలో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్‌గా గుర్తింపుపొందారు. టెక్నాలజీ అందరికీ చేరువకావాల్ని బలంగా కోరుతున్నారు. ఫిన్‌ల్యాండ్‌లో మార్టిన్ మూడో మహిళా ప్రధాని. ఆమె మరో నాలుగు ఇతర పార్టీలతో కలిసి... సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వాటిలో మూడు పార్టీలకు మహిళా అధినేతలే ఉన్నారు. వారి వయసు కూడా 35 ఏళ్ల లోపే.
Published by: Krishna Kumar N
First published: October 10, 2020, 12:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading