Plastic Ban : వేస్ట్ ప్లాస్టిక్ బాటిళ్లతో తులిప్ పూలతోట... ఐడియా అదుర్స్...

Plastic Ban : సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ని నిషేధించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఐతే... ఆల్రెడీ మన దేశంలో లక్షల టన్నుల ప్లాస్టిక్ బాటిళ్లు వేస్టుగా ఉన్నాయి. వాటిని ఇలా మార్చేస్తే ఎలా ఉంటుంది?

Krishna Kumar N | news18-telugu
Updated: September 30, 2019, 9:51 AM IST
Plastic Ban : వేస్ట్ ప్లాస్టిక్ బాటిళ్లతో తులిప్ పూలతోట... ఐడియా అదుర్స్...
వేస్ట్ ప్లాస్టిక్ బాటిళ్లతో తులిప్ పూలతోట (Credit - YT - Veuer)
Krishna Kumar N | news18-telugu
Updated: September 30, 2019, 9:51 AM IST
మన ఇండియాలో లాగానే ఫిలిప్పీన్స్‌లో కూడా ప్లాస్టిక్ చెత్త ఎక్కువైపోయింది. దాంతో అక్కడి ప్రభుత్వం ఆ చెత్తకు ఎలా చెక్ పెట్టాలా అని ఆలోచించింది. అప్పుడు తట్టింది ఓ ఐడియా. రకరకాల వేస్ట్ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి... ఇలా తులిప్ పూలతోటను తయారుచేశారు. ఫిలిప్పీన్స్‌లోని లామిటాన్ సిటీలో ఈ తులిప్స్ గార్డెన్ ఉంది. ఇక్కడున్న పూలన్నీ ప్లాస్టిక్ బాటిళ్లతో తయారైనవే. మొత్తం 26,877 బాటిళ్లను తీసుకొని... వాటిని తులిప్ పూల ఆకారంలోకి మార్చి... వాటికి రెడ్, ఎల్లో, పింక్, బ్లూక్, పర్పుల్ కలర్స్ వేశారు. మొత్తం 45 పట్టణాల నుంచీ ఈ బాటిళ్లను సేకరించారు. ప్లాస్టిక్ వ్యర్థాల్ని వేస్ట్‌గా ఉంచడం కంటే ఇలా మార్చడం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతోందని లామిటాన్ సిటీ మేయర్ తెలిపారు.


మన ఇండియాలో లెక్కలేనన్ని పట్టణాన్నాయి. కోట్ల ప్లాస్టిక్ బాటిల్స్ వేస్టుగా పడి ఉన్నాయి. మనమూ ఇలాంటి పార్కులు నిర్మించాలని అనుకుంటే... ఎన్ని పార్కులు తయారవుతాయో కదా.

First published: September 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...