హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Pak Updates : పాక్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం..పార్లమెంట్ రద్దు,90 రోజుల్లో ఎన్నికలు

Pak Updates : పాక్ అధ్యక్షుడు సంచలన నిర్ణయం..పార్లమెంట్ రద్దు,90 రోజుల్లో ఎన్నికలు

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (ఫైల్)

Elections In Pakistan : ప్ర‌జాస్వామిక విధానంలోనే ఎన్నిక‌లు జ‌ర‌గాలని... ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని తాను ప్ర‌జ‌ల‌ను కోరుతున్నాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్ర‌జాస్వామ్యంగా దేశంలో ఎన్నిక‌లు జ‌రిగితే ఎవ‌రి భ‌విష్య‌త్తు ఏంది అనేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు. అంతిమ నిర్ణేత‌లు ప్ర‌జ‌లే అని ఇమ్రాన్ పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...

Pakistan National Assembly Dissolves :  పాక్ జాతీయ అసెంబ్లీ(పాకిస్తాన్ పార్లమెంట్) ర‌ద్దు చేస్తూ పాకిస్తాన్ రాష్ట్ర‌ప‌తి అరిఫ్ అల్వీ సంచలన నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ రోజు పాక్ పార్లమెంట్ సెషన్ లో స్పీకర్ స్థానంలో కూర్చొని సభను నడిపిన డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి..ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మాణంపై ఓటింగ్ జరపకుండా..ఇది విదేశీ కుట్ర అని పేర్కొంటూ ఆ తీర్మానాన్ని తిరస్కరించిన విషయం తెలిసిందే. స్పీకర్ అవిశ్వాస తీర్మాణాన్ని తిరస్కరించిన తర్వాత జాతీయ అసెంబ్లీని ర‌ద్దు చేయాలంటూ ప్ర‌ధాని ఇమ్రాన్ సిఫార్సు చేసిన కేవ‌లం 30 నిమిషాల్లోనే రాష్ట్ర‌ప‌తి ర‌ద్దు చేయ‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. ఇక‌,పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు నేపథ్యంలో 90 రోజుల్లో పాకిస్తాన్‌ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రాజ్యాంగంలోని 224 ఆర్టిక‌ల్ ప్ర‌కారం ప్ర‌ధానిగా ఇమ్రాన్ త‌న విధుల‌ను నిర్వ‌ర్తిస్తార‌ని మంత్రి ఫ‌వాద్ చౌధురి ప్ర‌క‌టించారు. అయితే కేబినెట్ మాత్రం ర‌ద్దు అయినట్లు తెలిపారు.

అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైన తర్వాత జాతిని ఉద్దేశించి చేసిన సంక్షిప్త ప్రసంగంలో.. దేశ ప్రజలకు అభినందలు తెలిపారు ఇమ్రాన్ ఖాన్. తదుపరి ఎన్నికలకు దేశం సిద్ధం కావాలని అన్నారు. అన్ని అసెంబ్లీలను రద్దు చేయాలని అధ్యక్షుడు అల్వీకి సలహా ఇచ్చారని చెప్పారు. ప్ర‌జాస్వామిక విధానంలోనే ఎన్నిక‌లు జ‌ర‌గాలని... ఎన్నిక‌ల‌కు సిద్ధం కావాల‌ని తాను ప్ర‌జ‌ల‌ను కోరుతున్నాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్ర‌జాస్వామ్యంగా దేశంలో ఎన్నిక‌లు జ‌రిగితే ఎవ‌రి భ‌విష్య‌త్తు ఏంది అనేది ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు. అంతిమ నిర్ణేత‌లు ప్ర‌జ‌లే అని ఇమ్రాన్ పేర్కొన్నారు.

ALSO READ Pak Updates : పాకిస్తాన్ లో మ్యాజిక్..ఇమ్రాన్ ఖాన్ సేఫ్..అవిశ్వాస తీర్మానం రద్దు

అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని విపక్ష నాయకుడు చెప్పారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రస్తుత ఛైర్మన్,విపక్ష నేత బిలావల్ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.."ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ కు అనుమతించలేదు. ఉమ్మడి ప్రతిపక్షం పార్లమెంటును విడిచిపెట్టడం లేదు. మా న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్తున్నారు. పాకిస్తాన్ రాజ్యాంగాన్ని రక్షించడానికి, సమర్థించడానికి, రక్షించడానికి అన్ని సంస్థలు ఆందోళన చేపట్టాలని మేము పిలుపునిచ్చాము. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించాలని కోరుతాము"అని అన్నారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Elections, Imran khan, Pakistan

ఉత్తమ కథలు