హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Putin-Kim : చేతులు కలిపిన పుతిన్-కిమ్..శత్రు దేశాల అంతు చూద్దామని లేఖలు!

Putin-Kim : చేతులు కలిపిన పుతిన్-కిమ్..శత్రు దేశాల అంతు చూద్దామని లేఖలు!

కిమ్-పుతిన్(ఫైల్ ఫొటో)

కిమ్-పుతిన్(ఫైల్ ఫొటో)

Russia- North Korea Ties: రష్యా-ఉత్తరకొరియా...ఆయుధ సంపత్తి పరంగా,సైనిక పరంగా రెండూ బలమైన దేశాలే. ఈ రెండు దేశాలు ఒక్కటైతే వీరిని ఆపడం చాలా కష్టం. ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యాకి సాయం చేసుందుకు రెడీ అని ఇప్పటికే కిమ్ ప్రభుత్వం ప్రకటించింది. అదే జరిగితే యుద్ధంలో ఉక్రెయిన్ చరిత్రలో కనివినీ ఎరుగని భారీ వినాశనాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Russia- North Korea Ties: రష్యా-ఉత్తరకొరియా...ఆయుధ సంపత్తి పరంగా,సైనిక పరంగా రెండూ బలమైన దేశాలే. ఈ రెండు దేశాలు ఒక్కటైతే వీరిని ఆపడం చాలా కష్టం. ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యాకి సాయం చేసుందుకు రెడీ అని ఇప్పటికే కిమ్ ప్రభుత్వం ప్రకటించింది. అదే జరిగితే యుద్ధంలో ఉక్రెయిన్ చరిత్రలో కనివినీ ఎరుగని భారీ వినాశనాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అయితే నార్త్ కొరియా ఆఫర్ కి రష్యా ఇంకా నో చెప్పలేదు..అలాగని ఓకే చెప్పలేదు. అవసరమైతే తప్పక మీ సహకారం తీసుకుంటాం అని ఉత్తరకొరియాకు రష్యా చెప్పింది. ఉక్రెయిన్‌లో రష్యా ప్రకటించిన డొనెట్స్క్‌, లుహాన్స్క్‌ స్వతంత్ర రాష్ట్రాలను ఉత్తర కొరియా గుర్తించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌తో యుద్ధం వేళ ర‌ష్యాపై ఇప్ప‌టికే అనేక దేశాలు ఆంక్ష‌లు విధించిన విషయం తెలిసిందే. ర‌ష్యాతో ఎలాంటి వ్యాపార సంబంధాలు పెట్టుకోరాద‌ని అమెరికా సహా పలు దేశాలు ఆదేశాలు ఆంక్ష‌లు విధించాయి. అయితే భారత్ సహా ర‌ష్యాతో బ‌ల‌మైన సంబంధాలు క‌లిగిన కొన్ని దేశాలు వాటిని ప‌ట్టించుకోకుండా ర‌ష్యాతో వ్యాపార లావాదేవీలు కొన‌సాగిస్తున్నాయి. అలాంటి దేశాల్లో ఉత్త‌ర కొరియా కూడా ఒకటి.

ఇదిలా ఉంటే ఉమ్మడి ప్రయత్నాలతో రష్యా, ఉత్తర కొరియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా విస్తరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Vladimi Putin) ఆకాంక్షించారు. ఇందులో భాగంగానే ఉత్తర కొరియా విమోచన దినోత్సవం(Korean Liberation Day)సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌(Kim Jong Un)కి పుతిన్ ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఇరు దేశాల ద్వైపాక్షికి సంబంధాలను విస్తరిద్దాం అని పుతిన్ కిమ్ ని కోరారు. "ఇరు దేశాల ప్రయోజనాలు కోరి సన్నిహిత సంబంధాలు కొనసాగిద్దాం...కొరియా ద్వీపకల్పం, ఈశాన్య ఆసియా ప్రాంత భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేయడంలో ఇవి సహాయపడతాయి'"అని కిమ్ కి రాసిన లేఖలో పుతిన్ పేర్కొన్నారు.

కిమ్‌ కూడా పుతిన్ లేఖకు.. లేఖ రూపంలో స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించిన జపాన్‌పై విజయంతో రష్యా- ఉత్తర కొరియా మధ్య స్నేహం ఏర్పడిందని గుర్తుచేశారు. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. శత్రు దేశాల బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. పుతిన్ లేఖకు.... కిమ్‌ జోంగ్ ఉన్ సైతం లేఖ రూపంలో స్పందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో కొరియా ద్వీపకల్పాన్ని ఆక్రమించిన జపాన్‌పై విజయంతో రష్యా- ఉత్తర కొరియా మధ్య స్నేహం ఏర్పడిందని పుతిన్ కి రాసిన లేఖలో కిమ్ గుర్తుచేశారు. అప్పటినుంచి ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారం కొత్త శిఖరాలకు చేరుకుందన్నారు. శత్రు దేశాల బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలను ఉమ్మడిగా ఎదుర్కొందామని పుతిన్ కి రాసిన లేఖలో కిమ్ పిలుపునిచ్చారు.

OMG : ఘోర ప్రమాదం.. బ్రేకులు ఫెయిల్ అయ్యి నదిలో పడిపోయిన జవాన్ల బస్సు

కమ్యూనిస్టు దేశమైన ఉత్తర కొరియాను 1948లో తొలిసారిగా గుర్తించింది అప్పటి సోవియట్ నే. రెండో ప్ర‌పంచ యుద్ధం స‌మ‌యంలో కొరియాను జ‌పాన్ ఆక్ర‌మించుకున్న సంగ‌తి తెలిసిందే. కాగా, ర‌ష్యా స‌హ‌కారంతో కొరియాకు విమోచ‌నం ల‌భించింది. ఉమ్మ‌డి కొరియా ఉత్త‌ర‌, ద‌క్షిణ కొరియాలుగా విడిపోయిన త‌రువాత ఉత్త‌ర కొరియా ర‌ష్యాతో సంబంధాలు కొన‌సాగిస్తూ వ‌స్తున్న‌ది. ఇప్ప‌టికీ రెండు దేశాల మ‌ధ్య బ‌ల‌మైన మైత్రి కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కోవిడ్ కు కొద్ది నెలల క్రితం కిమ్ లో కూడా పర్యటించి పుతిన్ తో ఇరు దేశాల సంబంధాల బలోపేతం సహా పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే. ర‌ష్యాకు బ‌ద్ద‌శ‌త్రువైన అమెరికాను ఉత్త‌ర కొరియా కూడా పూర్తి స్థాయిలో వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్న‌ది. ఇక ఇదిలా ఉంటే, ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాలోని మిత్ర‌దేశాల‌కు సాధార‌ణ ఆయుధాల నుంచి అధునాత ఆయుధాల‌ను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని, మిత్ర‌దేశాల‌తో తాము మైత్రిని కొన‌సాగిస్తామ‌ని పుతిన్ పేర్కొన్నారు. మాస్కో సమీపంలో ఆర్మీ-2022 పేరిట ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శనను పుతిన్‌ ప్రారంభించి ప్రసంగించిన పుతిన్...ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలతో మాస్కో తన సంబంధాలకు విలువనిస్తుందని పేర్కొన్నారు.

First published:

Tags: Kim jong un, North Korea, Russia, Vladimir Putin

ఉత్తమ కథలు