రోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicran) అత్యంత వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తోంది. దీంట్లో భారీ స్థాయిలో బయటపడిన మ్యుటేషన్లు వైరస్ (Virus) వ్యాప్తి రేటు పెరగడానికి కారణమవుతున్నాయి. కొన్ని నెలల క్రితం ప్రపంచాన్ని భయపెట్టిన డెల్టా వేరియంట్ (Delta Variant) కంటే ఈ కొత్త రూపాంతరం చాలా ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు 50 మ్యుటేషన్లు ఉండటమే ఇందుకు కారణం. ఒమిక్రాన్ వేరియంట్‌కు చాలా వేగంగా పరివర్తన చెందగల సామర్థ్యం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. తాజాగా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా అవుతుండడంతో డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ వేరియంట్ 77దేశాలకు విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. గత వేరియంట్లతో పోలిస్తే ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.. ముఖ్యంగా ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువగా ఉందని సంస్థ పేర్కొంది.
ఒమిక్రాన్‌లో ఇప్పటివరకు 50 మ్యుటేషన్లు ఉండటమే ఇందుకు కారణం. ఒమిక్రాన్ వేరియంట్‌కు చాలా వేగంగా పరివర్తన చెందగల సామర్థ్యం ఉంటుంది. దీంతో ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లు (Corona Vaccines) ఈ కొత్త వేరియంట్‌పై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత వ్యాక్సిన్ ఒమిక్రాన్‌పై తక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని బ్రిటిష్ కంపెనీ మోడెర్నా తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి కోవిడ్ నిబంధనలు పాటించాలని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తోంది.
Omicron symptoms: అలసట.. రాత్రిళ్లు విపరీతంగా చెమట పట్టడం.. ఒమిక్రాన్ కొత్త లక్షణాలు ఇవే!
కొత్త లక్షణాలు..
ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడిన కొందరు రాత్రిళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నారని వైద్యులు గుర్తించారు. ఒమిక్రాన్ బారిన పడిన వారిలో భిన్న మైన లక్షణాలు కన్పిస్తున్నాయని వైద్యులు గుర్తించారు. కొవిడ్ 19 సాధారణ లక్షణాలైన దగ్గు, తరచూ ముక్కు కారడం , గొం తు నొప్పి , తీవ్రమైన జ్వ రం వం టివి కొత్త వేరియం ట్ బాధితుల్లో లేవు.
వ్యాక్సిన్లు వ్యాప్తిని తగ్గిస్తాయి..
కోవిడ్ వ్యాక్సిన్లపై డబ్ల్యూహెచ్ఓ (WHO) ఆగ్నే యాసియా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్లు వైరస్ సోకే అవకాశాలను తగ్గిస్తాయే తప్ప పూర్తిగా అడ్డుకుంటాయని అనుకోవద్దని అన్నారు. ప్రస్తుతం అందరికీ వ్యాక్సిన్ (Vaccines)లు అందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. అవసరం అయితే బూస్టర్ డోస్ అందించాలని అన్నారు.
Omicron: కలవర పెడుతున్న ఒమిక్రాన్.. మాస్క్ పెట్టుకోకుంటే రూ.2.24లక్షల జరిమానా!
ఒమిక్రాన్ లక్షణాలు.. ప్రభావం
- ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ సోకిన వారికి నిర్దిష్ట లక్షణాలంటూ ప్రత్యేకంగా లేవు.
- డెల్టా వలె, ఓమిక్రాన్ సోకిన వారిలో కొందరిలో లక్షణాలు బయటపడడం లేదు.
- వేరియంట్ సోకినవారికి కండరాల నొప్పితో పాటు 1-2 రోజులు అలసిపోయినట్లు అనిపిస్తుంది.
- గొంతు నొప్పి, తలనొప్పి మరియు ఛాతీ నొప్పి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
- ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారికి తలనొప్పి, శరీరంలో నొప్పి వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
- వ్యాక్సిన్ తీసుకోని వారు ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ బారిన పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Omicron, Omicron corona variant, World Health Organisation