కొత్త వేరియంట్ కరోనా అమెరికా (America)ను కలవర పెడుతోంది. రోజు రోజుకు కొత్త కేసులు వస్తుండడంతో అమెరికాలో పలు నగరాలు అప్రమత్తమయ్యాయి. ఒమిక్రాన్ కలవరపెడుతున్న నేపథ్యం లో కాలిఫోర్ని యా అధికార యం త్రాం గం అప్రమత్తమైంది. మాస్క్ (Mask) ధరించడం తప్పనిసరి నిబంధనను మళ్లీ తెరపైకి
తీసుకొచ్చింది. పలు కొత్త నిబంధనలు తప్పకుండా పాటించాలని గవర్నర్ గావిన్ న్యూసమ్ ప్రజలకు సూచించారు. ప్రజలు జనవరి 15, 2022 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని కాలిఫోర్నియా వాసులకు గవర్నర్ సూచించారు. ఒక్క కాలిఫోర్నియాలోనే కాకుండా అమెరికాలో చాలా ప్రాంతాల్లో కోవిడ్ ఆంక్షల (Covid 19 Restrictions) ను విధిస్తున్నారు. అమెరికాలో ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి పెరుగుతుండడంతో కరోనా కట్టడికి అమెరికా ప్రభుత్వం విదేశాల్లోంచి వచ్చే వారిపై కఠినమైన ఆంక్షలను విధించింది. ఇకపై అమెరికా ప్రయాణం చేసేవారికి ఈ కఠిన నిబంధనలు పాటించక తప్పదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అమెరికాలో దాదాపు కరోనా కేసులు 47శాతం పెరిగినట్టు ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యం ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా బయల్దేరడానికి ఒక్క రోజు ముందు చేయించున్న కొవిడ్ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో నెగెటివ్ వచ్చినట్టు ప్రయాణికులు ధ్రువపత్రం కచ్చితంగా చూపించాలి.
Omicron symptoms: అలసట.. రాత్రిళ్లు విపరీతంగా చెమట పట్టడం.. ఒమిక్రాన్ కొత్త లక్షణాలు ఇవే!
ఈ నిబంధన అమెరికన్లకూ వర్తిస్తుంది. అమెరికన్లంతా జనవరి వరకు మాస్కులు కచ్చితంగా ధరించాలని నిబంధన విధించింది. ఎవరైన పబ్లిక్ ప్లేస్లో మాస్క్లు ధరించకుంటే రూ.37 వేల నుం చి రూ.2.25 లక్షల (500-3,000 డాలర్ల) వరకూ జరిమానా విధిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు నెగిటీవ్ వచ్చినా కొద్ది రోజులు క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
వ్యాక్సిన్లు వ్యాప్తిని తగ్గిస్తాయి: డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు కలకలం రేపుతున్నాయి. నెమ్మదిగా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు ఆంక్షలు పెంచుతున్నాయి. అమెరికాలో ఒమిక్రాన్కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సిన్లపై డబ్ల్యూహెచ్ఓ (WHO) ఆగ్నే యాసియా రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్లు వైరస్ సోకే అవకాశాలను తగ్గిస్తాయే తప్ప పూర్తిగా అడ్డుకుంటాయని అనుకోవద్దని అన్నారు. ప్రస్తుతం అందరికీ వ్యాక్సిన్ (Vaccines)లు అందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Mask, Omicron, Omicron corona variant