హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Omicron: పిల్ల‌ల్లో పెరుగుతున్న కోవిడ్ ఇన్ఫెక్ష‌న్‌లు.. ద‌క్షిణాఫ్రికా ఆందోళ‌న

Omicron: పిల్ల‌ల్లో పెరుగుతున్న కోవిడ్ ఇన్ఫెక్ష‌న్‌లు.. ద‌క్షిణాఫ్రికా ఆందోళ‌న

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covid 19 Infections | ద‌క్షిణాఫ్రికా (South Africa)లో బ‌య‌ట‌ప‌డ్డ క‌రోనా వేరియంట్ ఆ దేశాన్ని ఆదోళ‌న‌కు గురి చేస్తోంది. ప్ర‌స్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా (Delta) కన్నా మూడు రెట్లు వేగంగా ఉంటుందని ఓ వైపు ప్రపంచదేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా పిల్ల‌లో కోవిడ్ ఇన్ఫెక్ష‌న్‌లు వ‌స్తున్న‌ట్టు ద‌క్షిణాఫ్రికా పేర్కొంది.

ఇంకా చదవండి ...

ద‌క్షిణాఫ్రికా (South Africa)లో బ‌య‌ట‌ప‌డ్డ క‌రోనా వేరియంట్ ఆ దేశాన్ని ఆదోళ‌న‌కు గురి చేస్తోంది. ప్ర‌స్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి డెల్టా (Delta) కన్నా మూడు రెట్లు వేగంగా ఉంటుందని ఓ వైపు ప్రపంచదేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో చిన్నారుల్లో కోవిడ్ ఇన్ఫెక్షన్లు  (Infections)పెరుగుతున్నాయని దక్షిణాఫ్రికాకు చెందిన వైద్య బృందం చెప్పడం మరింత ఆందోళన పెంచింది. ప్ర‌స్తుతం శుక్ర‌వారం రోజు ద‌క్షిణాఫ్రికాలో 6,055 మందికి పాజిటివ్ (Positve)  నిర్ధారణ కాగా.. 25 మంది మృతిచెందారు. దీంతో ఆదేశంలో వ్యాప్తి వేగంపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుంది. గ‌తంలో క‌రోనా వ్యాప్తి స‌మ‌యంలో పిల్ల‌ల‌పై ప్ర‌భావం త‌క్కువ‌గా ఉండేది కానీ ఈ స‌రి పిల్ల‌ల కూడా కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్‌లు వ్యాపిస్తున్న‌ట్టు గుర్తించామ‌ని ద‌క్షిణాఫ్రికా వైద్య బృందం పేర్కొంది.

"ప్రస్తుతంఅన్ని వయసుల వారితో పాటు మరీ ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు ఆస్పత్రుల్లో చేరుతున్న సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

Winter Olympics 2022: క్రీడ‌ల‌పై కొత్త వేరియంట్ ప్ర‌భావం.. వింట‌ర్ ఒలంపిక్స్ నిర్వ‌హ‌ణ సాధ్య‌మేనా?


ముందుగా ఊహించినట్టుగానే ఆ రేటు తక్కువగానే ఉన్నా.. 60ఏళ్లు పైబడిన వ్యక్తుల తర్వాత ఐదేళ్ల లోపు వారిలోనే ఆస్పత్రుల్లో చేరే అవసరం అధికంగా ఉంది." అని ద‌క్షిణాఫ్రికాకు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్ కి చెందిన వైద్యులు వాసిలా జస్సాత్ తెలిపారు.

సౌతాఫ్రికాలోని అతిపెద్ద ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్‌ అయిన లాన్సెంట్ ల్యాబొరేటరీ (Lancet laboratory)లో పనిచేస్తున్న రాక్‌వెల్ వియన్నా.. ఒమిక్రాన్ వేరియంట్‌ను మొదటిసారి కనుగొన్నారు.  ప్ర‌పంచం ఆరోగ్య సంస్థ నవంబర్ 26న దీని గురించి హెచ్చరించింది. ఈ రూపాంతరం, మొదట B.1.1.1.529గా గుర్తించారు. ఆ తర్వాత Omicron అని పేరు పెట్టారు. ఇతర రూపాంతరాల కంటే ఇది మరింత అంటువ్యాధి అయినందున ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వైరస్‌ను గుర్తించిన తర్వాత, దక్షిణాఫ్రికాలో అకస్మాత్తుగా పాజిటివ్ కేసులు పెరిగాయి.

Omicron corona variant: కొత్త వేరియంట్ ఆందోళ‌నక‌రం.. వ్యాప్తి నివార‌ణ‌కు చ‌ర్య‌లు అవ‌స‌రం: డ‌బ్ల్యూహెచ్ఓ


దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ (Omicran Variant) బయటపడటం, దీనికి వేగంగా వ్యాపించగలిగే లక్షణాలు ఉండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పలు దేశాలు ఈ ప్రాంతం నుంచి రాకపోకలను పరిమితం చేశాయి. టీకాలు తీసుకున్న వారిపై కూడా ఈ వేరియంట్ ప్రభావం చూపుతోందనే భయంతో అన్ని దేశాలు కోవిడ్ మార్గదర్శకాలపై దృష్టిసారించాయి. దక్షిణాఫ్రికాలో రోజువారీ కరోనా ఇన్‌ఫెక్షన్ రేటు ఈ వారం చివరి నాటికి నాలుగు రెట్ల నుంచి 10,000 రెట్లు పెరుగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ లక్షణాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి? ఏ వయసు వారిలో ఇది తీవ్రంగా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనటానికి శాస్త్రవేత్తలకు మరింత డేటా అవసరం. డబ్ల్యూహెచ్‌ఓ కూడా ఇదే విషయం చెప్పింది.

First published:

Tags: Covid -19 pandemic, Omicron corona variant, South Africa, World Health Organisation

ఉత్తమ కథలు