కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ఊపిరిపీల్చుకుంటున్న వేళ.. మరో కొత్త వేరియెంట్ గుబులు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడిన B 1.1.529 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా వేరియెంట్ (Corona VArient) మిగతా వాటితో పోల్చితే అత్యంత ప్రమాదకరమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చాలా ఉత్పరివర్తనాలు ఉన్నాయని, ఇప్పటి వరకు చూసిన వైరస్‌లో ఇదే ఘోరమైదని చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన ‘బి.1.1.529’ వేరియంట్ .. ఆ తర్వాత పొరుగుదేశం బోట్స్వానాతో పాటు హాంకాంగ్‌కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) టెక్నికల్ అడ్వైజరీ సమావేశమయింది. బీ.1.1.529ను ఆందోళనర వేరియెంట్‌గా గుర్తించింది. అంతేకాదు ఈ కొత్త వేరియెంట్‌కు 'ఒమిక్రాన్' (Omicron) అని పేరుపెట్టింది.
న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ..
కేసుల సంఖ్య పెరుగుతండడంతో అమెరికాలోని న్యూయార్క్ (New York) రాష్ట్రం ఎమర్జెన్సీని ప్రకటించారు. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ ఓ ప్రకటనలో శుక్రవారం పేర్కొన్నారు. అయితే న్యూయార్క్‌లో ఇప్పటివరకు కొత్త వేరియంట్‌కు సంబంధించి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.
Airtel, Vi New Prices: ఎయిర్టెల్, వీఐ ప్రీపెయిడ్ టారిఫ్‌ల ధరలు పెంపు.. వివిధ ప్లాన్ల కొత్త ధరలివే..
కానీ, పలు దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే శీతాకాలంలో కరోనా వైరస్ కేసులు పెరిగే అవకాశం ఉందని, కోవిడ్ చికిత్సలకు (Covid 19 Treatment) ఆస్పత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.
భారత్‌లో నమోదు కాని కేసులు..
భారత్‌లో మాత్రం ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు నమోదు కాలేదని ఇండియన్ సార్స్-కొవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. ఐనప్పటికీ ప్రజలంతా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. ఒమిక్రాన్ వేరియెంట్‌కు వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగల, మునుపటి డెల్టా కంటే తీవ్రంగా వ్యాపించే సామర్థ్యం ఉంటే మరోసారి కోవిడ్ ఉద్ధృతి తప్పకపోవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేస్తున్నారు.
రాకపోకలపై నిషేధం..
ఒమిక్రాన్ వేరియెంట్ వెలుగుచూసిన దేశాల నుంచి విమానరాకపోకలను వెంటనే నిలిపివేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆయా దేశాల నుంచి భారత్‌లోకి వైరస్ (Virus) ప్రవేశించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇప్పటికే సౌతాఫ్రికాకు పలు దేశాలు విమాన సర్వీసులను నిలిపివేశాయి. దక్షిణాఫ్రికా సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్ ఇప్పటికే ఆంక్షలు విధించింది. దక్షిణాఫ్రికా, బోట్స్వానా, లెసాతో, ఎస్వాతిన్, జింబాబ్వే, నమీబియాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్ (Singapore), జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి. తాజాగా శ్రీలంక సైతం ఈ ఆరు దేశాలకు రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, New york, Omicron corona variant